Vijay Sai Reddy : సినీ న‌టుల‌పై విజ‌య సాయి సెటైర్

త‌క్కువ ఫీజు తీసుకుని బ‌తికిస్తున్నారు

Vijay Sai Reddy : త‌మ రెమ్యూన‌రేష‌న్ గురించి ప్ర‌భుత్వాలు ఎందుకు మాట్లాడుతాయంటూ పుండు మీద కారం చ‌ల్లారు మెగాస్టార్ చిరంజీవి. తాను న‌టించిన వాల్తేరు వీర‌య్య 200 రోజు పూర్తి చేసుకున్న సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌త్యేక హోదా, ప్రాజెక్టులు, ఉపాధి, త‌దిత‌ర కీల‌క అంశాల‌పై నోరు పారేసుకున్నారు. దీంతో ఒక్క‌సారిగా వైసీపీ నుంచి దాడి మొద‌లైంది. ఇదే స‌మ‌యంలో మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నువ్వేదో సినిమాల‌లో న‌టించ‌క మ‌ళ్లీ రాజ‌కీయాల‌లో వేలు పెడ‌తానంటే ఎలా అని ప్ర‌శ్నించారు.

Vijay Sai Reddy Comments

కొడాలి నాని అయితే టాలీవుడ్ ప‌కోడిగాళ్లు అంటూ ఎద్దేవా చేశాడు. ఇక పేర్ని నాని అయితే ఆనాడు ఏపీకి అన్యాయం జ‌రిగితే కేంద్ర మంత్రిగా ఉన్న నువ్వు ఎందుకు మాట్లాడ లేదంటూ నిల‌దీశారు. చివ‌ర‌కు ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి అయితే సినిమా వాళ్ల‌కు రాజ‌కీయాలు ఎందుకు అని ప్ర‌శ్నించారు. అదేదో నువ్వే ప్ర‌త్యేక హోదా మీ త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను అడిగి తీసుకు రావ‌చ్చు కదా అని ఉచిత స‌ల‌హా ఇచ్చారు.

ఇక వీరి జాబితాలోకి చేరి పోయారు వైసీపీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి(Vijay Sai Reddy). కొంద‌రు సినిమా హీరోలు పాపం చాలా త‌క్కువ రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటూ వీలైతే ఉచితంగా న‌టిస్తూ ..ల‌క్ష‌లాది మంది సినీ కార్మికుల‌ను బ‌తికుస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.

Also Read : TTD Chairman : సామాన్య భ‌క్తుడే నా తొలి ప్రాధాన్య‌త

Leave A Reply

Your Email Id will not be published!