TTD Chairman : సామాన్య భ‌క్తుడే నా తొలి ప్రాధాన్య‌త

టీటీడీ చైర్మ‌న్ గా భూమ‌న

TTD Chairman : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) నూత‌న చైర్మ‌న్ గా భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి గురువారం ప్ర‌మాణ స్వీకారం చేశారు. స్వామి అనుగ్ర‌హం వ‌ల్ల‌నే త‌న‌కు ఈ అరుదైన ప‌ద‌వి ద‌క్కింద‌న్నారు. ఆయ‌న ఆశీస్సులు, సీఎం జ‌గ‌న్ రెడ్డి స‌హ‌కారం వ‌ల్ల‌నే చైర్మ‌న్ గా ఛాన్స్ ల‌భించింద‌ని స్ప‌ష్టం చేశారు.

TTD Chairman Bhumana Karunakar Reddy

తిరుమ‌ల భ‌వ‌నంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి(Bhumana Karunakar Reddy) చైర్మ‌న్ బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి, టుడా చైర్మ‌న్ చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి, టీటీడీ పాల‌క మండ‌లి స‌భ్యులు, ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి, జేఈవో సుధా రాణి పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా టీటీడీ చైర్మ‌న్ గా కొలువు తీరిన భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి మాట్లాడారు. సామాన్య భ‌క్తుడే త‌న తొలి ప్రాధాన్య‌త అని పేర్కొన్నారు. హిందూ ధార్మిక‌త‌ను పెంపొందించేలా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

జీవితంలో ఒక్క‌సారైనా ఆ దేవ దేవుడు శ్రీ‌నివాసుడిని, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను ద‌ర్శించు కోవాల‌ని అనుకుంటార‌ని, అంతే కాదు ఎంతో మంది టీటీడీ చైర్మ‌న్ కావాల‌ని అనుకుంటార‌ని చెప్పారు. కానీ ఆ అవ‌కాశం నేటితో రెండోసారి ద‌క్కింద‌ని, ఇది త‌న పూర్వ జ‌న్మ సుకృతంగా భావిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

Also Read : RS Praveen Kumar : గ్రూప్-2 వాయిదా వేయండి – ఆర్ఎస్పీ

Leave A Reply

Your Email Id will not be published!