మేకెదాటు ఆనకట్టకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం
కర్ణాటక నిర్వాకంపై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర ఆగ్రహం
చెన్నై : కర్ణాటక మేకెదాటు ఆనకట్టకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. సీఎంగా కొత్తగా కొలువు తీరిన తర్వాత విజయ్ ఆధ్వర్యంలో శుక్రవారం మీటింగ్ జరిగింది. సీఎం విజయ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు; ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ , అన్నాడిఎంకె నాయకుడు ఎడప్పాడి కె. పళనిస్వామి సహా పలువురు ప్రతిపక్ష సభ్యులు ఈ అంశంపై మాట్లాడారు. చెన్నై: కావేరీ నదిపై మేకెదాటు వద్ద ఆనకట్ట నిర్మించాలన్న కర్ణాటక నిర్ణయానికి వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అన్ని చర్యలకు సభ మద్దతు ప్రకటించింది. విజయ్ ప్రవేశపెట్టిన తీర్మానంలో ఇలా పేర్కొన్నారు: కావేరీ జల వివాదాల ట్రిబ్యునల్ యొక్క 5.2.2007 నాటి తుది తీర్పును, సుప్రీంకోర్టు 16.2.2018 నాటి తీర్పును గౌరవించకుండా, కావేరీ నదిపై మేకెదాటు వద్ద ఆనకట్ట నిర్మించడానికి కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన ఏకపక్ష ప్రయత్నాన్ని ఈ సభ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది అని ప్రకటించారు.
సంబంధిత బేసిన్ రాష్ట్రాల అంగీకారం పొందకుండానే కర్ణాటక ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు సీఎం విజయ్ . అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి ఆమోదం పొందలేదని ఆ తీర్మానం పేర్కొంది. ఇటువంటి చర్య ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించిన మేకెదాటు ఆనకట్ట ప్రాజెక్టుకు సాంకేతిక, పర్యావరణ అనుమతులతో సహా ఎటువంటి ఆమోదాన్ని ఇవ్వవద్దని ఈ అత్యున్నత సభ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. కావేరీ బేసిన్ నీటి కొరత ఉన్న ప్రాంతమని, అందుబాటులో ఉన్న మొత్తం నీటిని ఇప్పటికే బేసిన్ రాష్ట్రాల మధ్య పంపిణీ చేశారని కావేరీ జల వివాదాల ట్రిబ్యునల్ తో పాటు అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు గుర్తించిందని తెలిపారు సీఎం విజయ్ జోసెఫ్ చంద్రశేఖర్.