బెంగళూరు : వందేళ్ల చరిత్ర కలిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కు మొట్ట మొదటిసారిగా కోలుకోలేని ఝలక్ ఇచ్చారు కర్ణాటక రాష్ట్ర హోం శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే. ఆర్ఎస్ఎస్ సంస్థకు సంబంధించి కార్యకలాపాలు, ఆదాయ వ్యయాల వివరాలు ఇవ్వాల్సిందేనని ఆదేశించారు. ఎందుకు పన్నులు ఇప్పటి వరకు చెల్లించ లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ గగ్గోలు పెడుతుండడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీనికి సనాతన ధర్మానికి ఏం సంబంధం అంటూ ప్రశ్నించారు. ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం ఏ సంస్థ అయినా చట్టబద్దంగా నిర్వహించాల్సిందేనని స్పష్టం చేశారు.
ఈ సందర్బంగా కర్ణాటకకు ఇటీవల నియమితులైన హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆ సంస్థకు లేఖ రాశారు. తమ వివరాలను వెల్లడించాలని, పన్నులు చెల్లించాలని, చట్టానికి , రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. ఆయన రాసిన లేఖ కలకలం రేపింది. ఈ ఏడాది శత వార్షికోత్సవాలు జరుపుకుంటున్న, భారీగా నిధులు పొందే బృహత్ సంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్ రహస్య కార్యకలాపాలను ఎత్తిచూపుతూ, ఖర్గే మర్యాద పూర్వకమైన రీతిలో ప్రశ్నించారు. ఆర్‌ఎస్‌ఎస్ తన వివరాలను వెల్లడించాలని, పన్నులు చెల్లించాలని, చట్టానికి , రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిందేనని పేర్కొన్నారు.
నా లేఖ మీకు త్వరలోనే అందుతుంది. అయితే, ఈ విషయంపై మీ దృష్టిని ముందుగానే ఆకర్షించడం ముఖ్యమని భావించాను. ముందుగా, 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్ఎస్ఎస్ కు అభినందనలు. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు, ఆదాయానికి సంబంధించి పన్నుల వివరాలు కూడా తెలియ చేయాలని స్పష్టం చేశారు.
