రైతుల కోసం మైక్రో ఇరిగేషన్ ఎక్విప్మెంట్ పార్క్

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మైక్రో ఇరిగేషన్ రైతుల కోసం మైక్రో ఇరిగేషన్ ఎక్విప్మెంట్ పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తున్న‌ట్లు చెప్పారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. మైక్రో ఇరిగేషన్ పరికరాల తయారీ కంపెనీలను ఎంకరేజ్ చేద్దాం అన్నారు. భవిష్యత్తులో హార్టికల్చర్, ఫ్లోరీకల్చర్ కు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. దీంతో మైక్రో ఇరిగేషన్ కు ప్రాధాన్యత పెరుగుతుందని అన్నారు. ఈ క్రమంలో మైక్రో ఇరిగేషన్ పరికరాల పరిశ్రమలను ప్రొత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. దీని వల్ల రైతులకూ తక్కువ ధరలో మైక్రో ఇరిగేషన్ ఎక్విప్మెంట్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. అమరావతిలో ఏఐ, ఆల్గారిథమ్స్ క్వాంటం అప్లికేషన్ల రూపకల్పన మొదలైందని అన్నారు. ప్రాజెక్టుల అనుమతులు, భూ కేటాయింపులు వంటివి సులభతరంగా అందించాలని స్ప‌ష్టం చేశారు.

దీంతో పాటు రాజకీయ జోక్యం అనేది లేకుండా చూడాలని అన్నారు. అన్ని నిబంధనలు పాటించిన ప్రాజెక్టులకు ఆటోమోషన్ పద్దతిలో అనుమతులు లభించే విధానాన్ని అనుసరిస్తే.. రాజకీయ జోక్యం తగ్గిపోతుంద‌ని పేర్కొన్నారు. ఆ దిశగా అధికారులు ఆలోచనలు చేయాల‌ని అన్నారు. అమరావతి క్వాంటం వ్యాలీకి , క్వాంటం అప్లికేషన్లతో పాటు క్వాంటం కంప్యూటింగ్ పరికరాలు కూడా రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు మరోవైపు ఆటోమొబైల్ పరిశ్రమలకు శ్రీసిటీ సహా అనంతపురం జిల్లా కూడా కీలకం. తిరుపతి, శ్రీసిటీలు రాయల్ ఎన్ ఫీల్డ్, ఇసుజు, హీరో లాంటి ఆటోమొబైల్ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయని తెలిపారు. అనంతపురంలో కియా కార్ల ఉత్పత్తి జరుగుతోందన్నారు. పుట్టపర్తిలో 5వ జనరేషన్ ఫైటర్ జెట్ తయారీ, టెస్టింగ్ ఫెసిలిటీ కేంద్రం వేగంగా గ్రౌండ్ కావాలన్నారు. ఫైటర్ జెట్ తయారీ కేంద్రం పనుల విషయంలో నిరంతరం ఫాలో అప్ చేస్తూ ఉండాల‌న్నారు. కేంద్రానికీ ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాల‌న్నారు.

Leave A Reply

Your Email Id will not be published!