బెంగళూరు : కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ వేదికగా ఆందోళన బాట పట్టింది సీజేపీ. ఈ సందర్బంగా నిరసనకారులను అక్రమంగా నిర్బంధాన్ని శివకుమార్ ఖండించారు, ఇది ప్రజాస్వామ్యానికి అవమానం అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా జీవితంలో ఉన్నవారు విమర్శలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని, ఏదైనా తప్పు జరిగినప్పుడు దానిని అంగీకరించాలని ముఖ్యమంత్రి అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ఉందా లేక ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి నెలకొని ఉందా అని ప్రశ్నించారు. మోదీ సర్కార్ కు ఇది మంచి పద్దతి కాదన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరగాల్సిన భారీ జన సమూహాన్ని ప్రభుత్వం అడ్డుకోవడానికి, అపూర్వమైన భద్రతా నిర్బంధం , సీజేపీ నాయకుడు అభిజిత్ దీప్కే, నలుగురు మాజీ ముఖ్యమంత్రులు, యూట్యూబర్ ధ్రువ్ రాతీతో సహా 7,000 మందికి పైగా నిరసనకారులను నిర్బంధించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు డీకే శివకుమార్ .
నిరసనకారులను ఆ ప్రాంతానికి దూరంగా ఉంచడానికి లుటియన్స్ ఢిల్లీలో 30,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించడం, బారికేడ్ల వరుసల కారణంగా, నిరసన ప్రదేశంగా నిర్దేశించిన జంతర్ మంతర్ రోజంతా నిర్మానుష్యంగా కనిపించింది. విమానాశ్రయం నుంచి అదుపులోకి తీసుకున్న వారితో సహా నిరసన నాయకులను నిర్బంధించడం భారతదేశానికి ఒక పెద్ద అవమానం అని పేర్కొన్నారు సీఎం. దేశంలో ప్రజాస్వామ్యం ఉందా లేక ఎమర్జెన్సీ ఉందా అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలి అని శివకుమార్ అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేందుకు, తమ గళాన్ని వినిపించేందుకు ప్రజలకు హక్కు ఉందని స్పష్టం చేశారు. వారి గొంతును ఎవరూ నొక్కలేరన్నారు. ఎన్నికల సంఘాన్ని, ఇతర నాయకులను కలుసుకుని, వారి ఆందోళనలకు స్పందించేందుకు వారికి అవకాశం కల్పించాలి అని అన్నారు.
ప్రజా జీవితంలో ఉన్నవారు విమర్శలను ఎదుర్కోవడానికి, ఏదైనా తప్పు జరిగినప్పుడు వాటిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. ఈ ఘటన పిరికితనాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన ఆరోపించారు.
