Vinesh Phogat : ఇందుకేనా ప‌త‌కాలు సాధించింది

రెజ్ల‌ర్ వినేష్ ఫోగ‌ట్ ఆవేద‌న

Vinesh Phogat : మ‌హిళా రెజ్ల‌ర్ల‌పై అర్ధ‌రాత్రి దాడికి దిగారు ఢిల్లీ ఖాకీలు. అకార‌ణంగా దౌర్జ‌న్యం చేయ‌డాన్ని తీవ్రంగా ఖండించారు రెజ్ల‌రు. ఇలాంటి రోజులు చూసేందుకు తాము ప‌త‌కాలు సాధించామా అని ప్ర‌శ్నించారు వినేష్ ఫోగ‌ట్(Vinesh Phogat). ఆమె ఖాకీల దాష్టీకంపై భ‌గ్గుమ‌న్నారు. రెజ్లింగ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా చీఫ్ , బీజేపీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ త‌మ‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డుతున్నాడంటూ ఆందోళ‌న చేప‌ట్టారు. గ‌త నెల ఏప్రిల్ 23 నుండి వాళ్లు జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌న దీక్ష చేప‌ట్టారు. ప‌లు పార్టీలు, వివిధ ప్ర‌జా సంఘాలు మ‌ద్ద‌తు తెలిపాయి.

అకాల వ‌ర్షం రావ‌డంతో మ‌డ‌త పెట్టుకునే ప‌రుపులు తీసుకు వ‌స్తుండ‌గా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఖాకీలు రెచ్చి పోయి ప్ర‌వ‌ర్తించారు. మ‌హిళ‌లు అని చూడ‌కుండా దుర్భాష‌లాడార‌ని వాపోయారు వినేష్ ఫోగట్(Vinesh Phogat). నిర‌స‌న ప్ర‌దేశంలో శాంతియుతంగా తాము ఆందోళ‌న చేప‌డితే త‌మ‌ను ఇలా అవ‌మానిస్తారా అంటూ నిప్పులు చెరిగారు.

ఢిల్లీ ఖాకీలు త‌మ‌ను దూషించారంటూ క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. ఓ పోలీస్ అధికారి తాగిన మ‌త్తులో త‌మ‌పై దాడికి దిగారంటూ ఆరోపించారు. తామేమీ నేర‌స్థులం కామ‌ని, దేశానికి ప్రాతినిధ్యం వ‌హించి, ప‌త‌కాలు సాధించిన క్రీడాకారుల‌న్న సంగ‌తి మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు.

ఇక మ‌రో రెజ్ల‌ర్ బ‌జ్ రంగ్ పునియా అయితే త‌న‌కు ప‌త‌కాలు అవ‌స‌రం లేదంటూ ప్ర‌క‌టించాడు. ఈ ప్ర‌భుత్వం న్యాయం వైపు నిల‌బ‌డ‌డం లేద‌ని వాపోయాడు.

Also Read : ప‌త‌కాలు తిరిగి ఇచ్చేస్తున్నా – పునియా

Leave A Reply

Your Email Id will not be published!