IPL Play Offs : ప్లే ఆఫ్స్ పై వీడని ఉత్కంఠ
నిలిచేదెవరు ఇంటికి వెళ్లేదెవరు
IPL Play Offs : ఐపీఎల్ 2022 ఆఖరి అంకానికి చేరింది. మరో కీలక మ్యాచ్ కు వేదిక కానుంది ముంబై. ఇప్పటికే 8 మ్యాచ్ లు గెలిచి
16 పాయింట్స్ సాధించి మెరుగైన రన్ రేట్ తో ప్లే ఆఫ్స్ కు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది రాజస్థాన్ రాయల్స్.
ఈ జట్టుకు ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే మెరుగైన రన్ రేట్ ఉండడమే. ఇప్పుడు ఒక్క స్థానం కోసం మూడు జట్లు పోటీ పడుతున్నాయి.
మరో లీగ్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ , ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది.
శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్ , రాజస్థాన్ రాయల్స్ మధ్య పోటీ నెలకొంది. ఒక వేళ ఢిల్లీ ఓడి పోతే బెంగళూరు కూడా ప్లే ఆఫ్స్(IPL Play Offs) కు
వచ్చే చాన్స్ ఉంది.
ఇక పాయింట్ల పరంగా చూస్తే ప్లే ఆఫ్స్ కు నాలుగు జట్లు చేరుకోవాల్సి ఉండగా ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ , లక్నో సూపర్ జెయింట్స్ దాదాపు చేరుకున్నాయి. ఇక రెండు స్థానాల కోసం పలు జట్లు పోటీ పడుతుండడంతో ఇంకా ఉత్కంఠ వీడడం లేదు.
ఇప్పటికే ముండై ఇండియన్స్, సీఎస్కే, కోల్ కతా నైట్ రైడర్స్ టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించినట్లే. గుజరాత్ 20 పాయింట్లతో, లక్నో
18 పాయింట్లతో ఫస్ట్, సెకండ్ ప్లేస్ కు చేరుకున్నాయి.
రాజస్థాన్ కు చెన్నైతో జీవన్మరణ సమస్య. గెలిస్తే దర్జాగా ప్లే ఆఫ్స్(IPL Play Offs) కు లక్నోను దాటేస్తుంది. లేదంటే మూడు లేదా నాలుగో ప్లేస్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. బెంగళూరు నాలుగో స్థానంలోకి చేరింది.
నిన్న గుజరాత్ టైటాన్స్ ను 8 వికెట్ల తేడాతో ఓడించడంతో పంజాబ్ కింగ్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ ఆశలు దాదాపు లేనట్లే. ముంబైపే
ఢిల్లీ గెలిస్తే ఆర్సీబీ కూడా నిష్క్రమిస్తుంది.
మొత్తంగా రన్ రేట్ పరంగా టాప్ లో ఉండడంతో చెన్నైతో ఓడినా ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది శాంసన్ సేన.
Also Read : మాథ్యూ వేడ్ వివాదంపై పాండ్యా కామెంట్