WI vs IRE T20 World Cup : ప్రపంచ కప్ నుంచి విండీస్ ఔట్
ఐర్లాండ్ చేతిలో పరాజయం
WI vs IRE T20 World Cup : ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు సార్లు టైటిల్ విజేతగా నిలిచిన వెస్టిండీస్ జట్టుకు కోలుకోలేని షాక్ తగిలింది. ఏకంగా వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. సూపర్ -12కు వెళ్లకుండానే చాప చుట్టేసింది.
అనామకులుగా భావించిన ఐర్లాండ్ జట్టు చేతిలో ఘోరమైన ఓటమిని(WI vs IRE T20 World Cup) చవి చూసింది. మొదటి రౌండ్ లో భాగంగా శుక్రవారం జరిగిన గ్రూప్ -బి మ్యాచ్ లో ఐర్లాండ్ బిగ్ షాక్ ఇచ్చింది విండీస్ కి. ఏకంగా 9 వికెట్ల తేడాతో పరాజయం పొందింది. గ్రూప్ దశలో భాగంగా ఆడిన మూడు మ్యాచ్ లలో రెండు మాత్రమే గెలుపొందింది.
ఇక శ్రీలంక ఎట్టకేలకు గ్రూప్ -12కు అర్హత సాధించింది. ఆ జట్టుకు కోలుకోలేని షాక్ తగిలింది ప్రారంభ మ్యాచ్ లోనే నమీబియా చేతిలో ఓటమి పాలైంది. ఇక తాజాగా మ్యాచ్ విషయానికి వస్తే హోబార్డ్ లోని బెల్లెరివ్ ఓవెల్ వేదికగా మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ పూరన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ ఎలాంటి ఒత్తిళ్లకు తలవంచ కుండా ఆడుతూ పాడుతూ ఛేదించింది. కేవలం 17.3 ఓవర్లలోనే పని కానిచ్చేసింది. విండీస్ బ్యాటింగ్ లో బ్రాండన్ కింగ్ 62 రన్స్ చేస్తే చార్లెస్ 24తో రాణించాడు.
ఇక ఐర్లాండ్ జట్టులో పాల్ స్టిర్లింగ్ 66 పరుగులతో నాటౌట్ గా మిగిలితే ఆండ్ ర్యూ 37 చేశారు. టక్కర్ 45 పరుగులతో రెచ్చి పోయాడు. దీంతో ఓటమి తప్పలేదు విండీస్ కు.
Also Read : జే షా కామెంట్స్ అక్రమ్ సీరియస్