Womens Asia Cup 2023 : అమ్మాయిలు రాటు దేలారు. ఓ వైపు ఇబ్బందులు ఎదుర్కొంటూనే మరో వైపు తమకంటూ ఎదురే లేదని చాటుతున్నారు. తమదైన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నారు. ప్రత్యర్థి జట్టును మట్టి కరిపించి ఆసియా కప్(Asia Cup 2023) హాకీ జూనియర్ ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకున్నారు.
మహిళల జూనియర్ ఆసియా కప్ ఫైనల్ సౌత్ కొరియాతో ఆడింది భారత జట్టు. ఆదివారం ఈ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇరు జట్లు కప్ కోసం హోరా హోరీగా తలపడ్డాయి. చివరకు మన అమ్మాయిలు 2-1 తేడాత్ దక్షిణ కొరియాకు షాక్ ఇచ్చారు. విజేతగా నిలిచారు. తొలిసారి ఆసియా కప్ ను గెలుచు కోవడం విశేషం.
ఇదిలా ఉండగా సౌత్ కొరియా నాలుగు సార్లు విజేతగా నిలిచింది. ఇదే క్రమంలో సెమీస్ తో సాధించిన విజయంతో జూనియర్ ప్రపంచ కప్ కు అర్హత సాధించింది భారత మహిళా జట్టు. ఇక వరల్డ్ కప్ 2023 నవంబర్ 29 నుంచి డిసెంబర్ 10 దాకా కొనసాగనుంది. ఈ వరల్డ్ కప్ కు చిలీ ఆతిథ్యం ఇవ్వనుంది.
ఇదిలా ఉండగా ఈ ఫైనల్ మ్యాచ్ జపాన్ లో జరిగింది. తొలి సెషన్ లో ఇరు జట్లు చెరో గోల్ సాధించి సమానంగా నిలిచాయి. రెండో సెషన్ లో మరో గోల్ సాధించడంతో భారత్ ఛాంపియన్ గా నిలిచింది.
Also Read : CM KCR : తెలంగాణ చారిత్రక వారసత్వానికి ప్రతీక
