WIPL 2023 : విమెన్ ఐపీఎల్ కు ముహూర్తం ఫిక్స్

మార్చి 4 నుంచి ముంబైలోనే అన్ని మ్యాచ్ లు

WIPL 2023 : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు విమెన్ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (డ‌బ్ల్యుఐపీఎల్) లీగ్ ను వ‌చ్చే మార్చి నెల‌లోనే నిర్వ‌హించ‌నుంది. అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది. తేదీని కూడా ఖ‌రారు చేసింది. మార్చి 4 నుంచి ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్ జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది.

ఇప్ప‌టికే భారీ ఎత్తున విమెన్స్ ఐపీఎల్(WIPL 2023) నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి భారీ ఎత్తున ఆదాయం స‌మ‌కూరింది బీసీసీఐకి. ప్ర‌పంచంలోనే మోస్ట్ రిచెస్ట్ క్రికెట్ సంస్థ‌గా నిలిచింది. ఇప్ప‌టికే ఐదు జ‌ట్ల‌ను ఫ్రాంచైజీలు భారీ ధ‌ర‌కు కొనుగోలు చేశాయి. 

కాగా మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ వేలం పాట ఫిబ్ర‌వ‌రి 13న జ‌ర‌గ‌నుంది. ఇక విమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్ మ్యాచ్ ల‌న్నీ ముంబైలోనే జ‌ర‌గ‌నున్నాయ‌ని బీసీసీఐ వెల్ల‌డించింది. షెడ్యూల్ ను కూడా ఖ‌రారు చేసింది. మొత్తం 5 జ‌ట్లు పాల్గొన‌నున్నాయి. తొలి సీజ‌న్ లోని అన్ని మ్యాచ్ లో బ్ర‌బౌర్న్ మైదానం, డీవై ప‌టేల్ స్టేడియంలలో జ‌రుగుతాయ‌ని బీసీసీఐ ప్ర‌క‌టించింది.

ఇక విమెన్ ఐపీఎల్ కు సంబంధించి వేలం పాట‌ను ముంబైలోనే నిర్వ‌హించ‌నున్నారు. ఇందు కోసం ఏకంగా 1500 మంది మ‌హిళా క్రికెట‌ర్లు త‌మ పేర్లు న‌మోదు చేసుకున్నారు. వీరిలో 90 మందిని మాత్ర‌మే తీసుకోనున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఇక మ‌హిళా ఐపీఎల్(WIPL 2023) జ‌ట్టుకు సంబంధించి క‌నీసం 15 మంది లేదా 18 మంది ఉండ‌వ‌చ్చ‌ని తెలిపింది బీసీసీఐ.

ఉమెన్స్ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ద‌క్షిణాఫ్రికాలో జ‌ర‌గ‌నుంది. ఫైన‌ల్ మ్యాచ్ ఫిబ్ర‌వ‌రి 26న కొన‌సాగుతుంది. ఆ త‌ర్వాతే మ‌హిళ‌ల ఐపీఎల్ కు ప్లాన్ చేసింది బీసీసీఐ.

Also Read : ముంబై ఇండియ‌న్స్ మెంటార్ గా ‘గోస్వామి’

Leave A Reply

Your Email Id will not be published!