Delhi Police Wrestlers : ఖాకీల దౌర్జ‌న్యం రెజ్ల‌ర్ల‌కు గాయం

ఖండించిన వివిధ పార్టీలు

Delhi Police Wrestlers : త‌మ‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డుతున్న బీజేపీ ఎంపీ, డ‌బ్ల్యుఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూష‌ణ్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ఆందోళ‌న చేప‌ట్టిన మ‌హిళా రెజ్ల‌ర్ల‌పై పోలీసులు దాడికి దిగారు. ఊహించ‌ని ఈ ప‌రిణామంతో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వ‌ర్షం కురుస్తుండ‌డంతో నిరస‌న తెలిపే స్థ‌లానికి మ‌డ‌త‌లు ప‌డ‌క‌ల‌ను తీసుకు రావ‌డానికి ప్ర‌య‌త్నించిప్పుడు త‌మ‌పై ఖాకీలు దాడి చేశారంటూ రెజ్ల‌ర్లు ఆరోపించారు(Delhi Police Wrestlers).

త‌మ ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రెజ్ల‌ర్ల‌లో ఇద్ద‌రికి గాయాల‌య్యాయి. ఒక వ్య‌క్తి అప‌స్మార‌క స్థితిలో ప‌డి పోవ‌డంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆప్ ఎమ్మెల్యే సోమ‌నాథ్ భార‌తి అనుమ‌తి లేకుండా మ‌డ‌త ప‌డ‌క‌ల‌తో నిర‌స‌న స్థ‌లానికి చేరుకున్నారు.

దీనిని ఖాకీలు అడ్డుకున్నారు. ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. ఆ త‌ర్వాత ఆప్ నాయ‌కుడు, మ‌రో ఇద్ద‌రిని అదుపులోకి తీసుకున్నారు. ఖాకీల దురుసు ప్ర‌వ‌ర్త‌నకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైర‌ల్ గా మారాయి.

ధ‌ర్మేంధ్ర అనే తాగుబోతు పోలీసు వినేష్ ఫోగ‌ట్ ను దుర్భాష‌లాడాడు. ఈ విష‌యాన్ని మాజీ రెజ్ల‌ర్ రాజ్ వీర్ చెప్పారు. గీతా ఫోగ‌ట్ త‌న త‌మ్ముడు దుష్వంత్ ఫోగ‌ట్ త‌ల ప‌గిలి పోయింద‌ని వాపోయారు. మీరు చంపాల‌ని అనుకుంటే చంపండి అంటూ నిప్పులు చెరిగింది వినేష్ ఫోగ‌ట్. బ‌జ‌రంగ్ పునిమా షాకింగ్ కామెంట్స్ చేశాడు. నేను సాధించిన ప‌త‌కాల‌ను తిరిగి ఇచ్చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించాడు.

Also Read : ప‌త‌కాలు తిరిగి ఇచ్చేస్తున్నా – పునియా

Leave A Reply

Your Email Id will not be published!