YS Sharmila : జర్నలిస్టులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి
కేసీఆర్ పై నిప్పులు చెరిగిన షర్మిల
YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ తన స్థాయిని మరిచి జర్నలిస్టుల గురించి చులకన చేసి మాట్లాడడాన్ని ఆమె తీవ్రంగా తప్పు పట్టారు.
YS Sharmila Slams KCR
ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని సూచించారు. పత్రికలు, ఛానళ్లు స్థాపించిన వాళ్లకు కులం ఉండవచ్చేమో కానీ కలాలకు కులం ఉండదని గుర్తు పెట్టుకోవాలని స్పష్టం చేశారు వైఎస్ షర్మిల(YS Sharmila). విచిత్రం ఏమిటంటే పాత్రికేయులను పాములతో పోల్చడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు కీలకమైన పాత్ర పోషించారని, ఆ విషయం కేసీఆర్ మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. అధికారం ఉంది కదా అని అహంకార పూరితంగా మాట్లాడటం దారుణమన్నారు వైఎస్ షర్మిల. బంది పోట్ల రాష్ట్ర సమితి చేస్తున్న ఆగడాలను, అవినీతి అక్రమాలను బయట పెడితే నీకు కాకుండా పోయారని విషం చిమ్మితే ఎలా అని నిలదీశారు.
తెలంగాణ నీ జాగీరా కేసీఆర్..స్వంత జాగాలు ఇవ్వనని చెప్పడానికి అని మండిపడ్డారు. కేసీఆర్ చేసిన కామెంట్స్ ను ఖండిస్తున్నానని స్పష్టం చేశారు. తక్షణమే కేసీఆర్ జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read : Chiranjeevi Birth Day : జై చిరంజీవ సుఖీభవ