Subhas Sarkar : 58,626 టీచింగ్..నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీ
పార్లమెంట్ లో విద్యా శాఖ మంత్రి వెల్లడి
Subhas Sarkar : ప్రభుత్వ సంస్థల్లో 58,626 బోధన, బోధనేతర పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యా శాఖ మంత్రి పార్లమెంట్ లో వెల్లడించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కేంద్రీయ విద్యాలయాలలో ఉన్న ఖాళీల భర్తీపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. ఈ భర్తీ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు నోటిఫికేషన్లు కూడా జారీ చేసినట్లు చెప్పారు మంత్రి సుభాస్ సర్కార్(Subhas Sarkar).
ఇదిలా ఉండగా ప్రభుత్వ నిర్వహణలోని సంస్థల్లో భారీగా ఖాళీలు ఉన్నమాట వాస్తవమేనని తెలిపారు. కాగా ఇందులో బోధన పోస్టులు 29,276 ఉండగా బోధనేతర పోస్టులు 29,350 ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.
కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఎందుకు ఎక్కువ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయని ద్రవిడ మున్నేట కజగం (డీఎంకే) ఎంపీ కళానిధి వీరాస్వామి ప్రశ్నించారు. ఇందుకు కేంద్ర మంత్రి సుభాస్ సర్కా(Subhas Sarkar) ర్ సమాధానం ఇచ్చారు.
ప్రమోషన్ , కొత్త స్ట్రీమ్ ల అప్ గ్రేడేషన్ మంజూరుతో పాటు విద్యార్థుల బలాన్ని పెంపొందించడం వల్ల అదనంగా భర్తీ చేయాల్సి ఉందన్నారు. ఖాళీలను నింపడం అనేది నిరంతర ప్రక్రియ అని తెలిపారు.
సంబంధిత సంస్థ రిక్రూట్ మెంట్ నియమాల నిబంధనల ప్రకారం ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. బోధన, అభ్యాస ప్రక్రియకు ఆటంకం కలగకుండా చూసేందుకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) , నవోదయ విద్యాలయ సమితి (ఎన్వీఎస్) ద్వారా తాత్కాలిక వ్యవధి కోసం ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్లు సుభాస్ సర్కార్ తెలిపారు.
Also Read : ఆమె నాకు స్పూర్తి దిక్సూచి