Mansukh Mandaviya : మంకీ పాక్స్ కొత్త వ్యాధి కాదు – మన్సుఖ్
పార్లమెంట్ లో ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడి
Mansukh Mandaviya : దేశ వ్యాప్తంగా కొత్త కొత్త రోగాలతో ఆందోళనలు మొదలయ్యాయి. నిన్నటి దాకా కరోనా దెబ్బకు జనం బెంబేలెత్తి పోయారు. తాజాగా దేశంలో మంకీ పాక్స్ వ్యాధి కలకలం రేపుతోంది.
ఈ వ్యాధి కారణంగా కేరళలో ఒకరు చని పోగా రెండో కేసు ఢిల్లీలో నమోదైంది. దీనిపై పెద్ద ఎత్తున విపక్షాలు నిలదీశాయి. దీనికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా(Mansukh Mandaviya).
మంకీ పాక్స్ బాధ పడాల్సిన వ్యాధి కాదన్నారు. ఇది పాత వ్యాధేనని కొత్త వ్యాధి కాదని స్పష్టం చేశారు. దేశంలో ఏడు కేసులు నమోదు అయ్యాయి. దశల వారీగా కేసుల గురించి ఆరా తీస్తున్నామని తెలిపారు.
ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు మాండవియా. ఇది కొత్త వ్యాధి కాదని, ఆందోళన చెందవద్దని కోరారు. దీనిని తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
కరోనా లాంటి ప్రపంచాన్ని భయ పెట్టిన వ్యాధిని కూడా తాము తగ్గించ గలిగామని తెలిపారు. ప్రస్తుతం మంకీ పాక్స్ కంట్రోల్ లోనే ఉందన్నారు కేంద్ర మంత్రి.
కేంద్ర ప్రభుత్వం ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు మన్సుఖ్ మాండవియా(Mansukh Mandaviya).
మంకీ పాక్స్ ఇండియాలో, వరల్డ్ లో కొత్త కాదన్నారు. 1970 నుండి ఆఫ్రికా ఖండం నుండి వ్యాపించిందన్నారు. ఆనాటి నుంచి దానిని కంట్రోల్ చేసేందుకు చర్యలు తీసుకుంటూనే ఉన్నారని వెల్లడించారు.
అన్ని అవసరమైన మందుల్ని అందుబాటులో ఉంచామని చెప్పారు.
Also Read : కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ భళా