Vishwas Sarang : రాహుల్ దివ్యాంగ‌ క‌ళాకారుడు – సారంగ్

విశ్వాస్ సారంగ్ షాకింగ్ కామెంట్స్

Vishwas Sarang : మ‌ధ్య ప్ర‌దేశ్ భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన మంత్రి విశ్వాస్ సారంగ్(Vishwas Sarang) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. రాహుల్ గాంధీని విక‌లాంగ క‌ళాకారుడితో పోల్చారు. దీనిపై పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది.

ప్ర‌స్తుతం త‌మిళ‌నాడులోని క‌న్యాకుమారి నుంచి భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టారు. త‌మిళ‌నాడుతో పాటు కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌లో పూర్త‌యింది, 1,000 కిలోమీట‌ర్ల కు పైగా పూర్త‌యింది. ప్ర‌స్తుతం ఏపీ రాష్ట్రంలో కొన‌సాగుతోంది. రాహుల్ గాంధీ చేప‌ట్టిన పాద‌యాత్రకు పెద్ద ఎత్తున స్పంద‌న ల‌భిస్తోంది.

చిన్నారుల నుంచి వృద్దుల దాకా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఆద‌రిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఫుల్ జోష్ వ‌చ్చింది. దీంతో భార‌తీయ జ‌న‌తా పార్టీలో క‌ల‌క‌లం రేగుతోంది. విచిత్రం ఏమిటంటే తాజాగా బీజేపీ మంత్రి విశ్వాస్ సారంగ్ వికలాంగ (దివ్యాంగ‌) క‌ళాకారుడితో పోల్చారు. నిరంత‌రం త‌మ ప్ర‌భుత్వాన్ని , ప్ర‌ధానంగా న‌రేంద్ర మోదీని రాహుల్ గాంధీ టార్గెట్ చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు.

ఈ దేశంలో స‌వాల‌క్ష స‌మ‌స్య‌లు పేరుకు పోవ‌డానికి కాంగ్రెస్ పార్టీనే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని ఆరోపించారు విశ్వాస్ సారంగ్. ఆయ‌న ప‌దే ప‌దే గ‌రీబీ హటావో గురించి మాట్లాడుతున్నారని, కానీ రూ. 40,000 ధ‌ర ట్యాగ్ తో కూడిన టీష‌ర్టును ధ‌రించారంటూ ఎద్దేవా చేశారు.

సోష‌ల్ మీడియాలో విశ్వాస్ సారంగ్ చేసిన కామెంట్స్ తో కూడిన వీడియో వైర‌ల్ గా మారింది. రాహుల్ గాంధీని కామోతో పోల్చ‌డంపై స‌ర్వ‌త్రా నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. కాంగ్రెస్ సీరీయ‌స్ అయ్యింది.

Also Read : గ్రామీణ ఆవిష్క‌ర్త‌ల‌కు న‌జ‌రానా

Leave A Reply

Your Email Id will not be published!