Samatha Kumbh 2023 : ఘనంగా సమతా కుంభ్ ఉత్సవాలు
దివ్య సాకేతంలో కొలువు తీరిన భక్తులు
Samatha Kumbh 2023 : దివ్య సాకేతం మరోసారి జై శ్రీమన్నారాయణ తో మారు మ్రోగుతోంది. విశ్వ శాంతి కోసం ఉత్సవాలు కొనసాగుతున్నాయి. జగత్ గురు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో శంషాబాద్ లోని ముచ్చింతల్ ఆశ్రమంలో ఫిబ్రవరి 2 నుంచి సమతా కుంభ్ 2023 ఉత్సవాలు(Samatha Kumbh 2023) అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ప్రతి రోజూ పూజలు నిర్వహిస్తున్నారు. స్వామి వారి దర్శన భాగ్యం కోసం భక్తులు వేచి చూస్తున్నారు.
ఈనెల 2న ప్రారంభమైన సమతా కుంభ్ ఉత్సవాలు 14 వరకు కొనసాగుతాయి. దివ్య సాకేతంలో ఉదయం పూజలతో ప్రారంభమవుతోంది. శ్రీ విష్ణు సహస్ర పారాయణం కొనసాగుతోంది. రాత్రికి తీర్థ గోష్టి, ప్రసాద వితరణ జరుగుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
శనివారం ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల దాకా సామూహిక పారాయణం కొనసాగింది. 1.30 నుంచి 4.00 గంటల దాకా ప్రపంచ క్యాన్సర్ దినోత్సం సందర్బంగా వికాస తరంగిణి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8. 30 గంటల దాకా శేష వాహన సేవ, హంస వాహన సేవ చేపట్టారు. ఈ సందర్బంగా 18 గరుడ సేవలు అంగరంగ వైభవోపేతంగా సాగాయి.
సమతా కుంభ్ ఉత్సవాలలో భాగంగా ఆదివారం 108 రూపాలలో శాంతి కళ్యాణ మహోత్సవం ప్రధాన వేదికపై నిర్వహిస్తారు. 6న సోమవారం ఉదయం 11. 30 గంటలకు వసంతోత్సవం. సాయంత్రం 6. 00 నుంచి రాత్రి 8.30 గంటల వరకు గరుడ సేవ ఉంటుంది.
Also Read : ఇస్లాం ఉగ్రవాదానికి ఊతం – రామ్ దేవ్