Temjen Imna Along : టెమ్ జెన్ ఇమ్నా అలోంగ్ వైర‌ల్

బీజేపీ మంత్రి హ‌ల్ చ‌ల్

మ‌రోసారి హాట్ టాపిక్ గా మారారు నాగాలాండ్ కు చెందిన ప‌ర్యాట‌క‌, ఉన్న‌త విద్యా శాఖ మంత్రి టెమ్ జెన్ ఇమ్నా అలోంగ్. ఆయ‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే. భార‌తీయ జ‌న‌తా పార్టీలో వేళ్ల మీద లెక్కించిన మోస్ట్ పాపుల‌ర్ లీడ‌ర్ల‌లో ఇమ్నా అలోంగ్ ఒక‌రు. నిత్యం ఏదో ఒక అంశంపై ప్ర‌స్తావిస్తారు. ఆపై త‌న ఆలోచ‌న‌ల‌ను పంచుకుంటారు. ప్ర‌ధానంగా సామాజిక మాధ్య‌మాల‌లో మ‌నోడు టాప్. వాట్సాప్ యూనివ‌ర్శిటీలో అత్యంత జ‌నాద‌ర‌ణ క‌లిగిన నేత‌గా ఇప్ప‌టికే గుర్తింపు పొందారు.

రెండోసారి మంత్రిగా కొలువు తీరిన టెమ్ జెన్ ఇమ్నా అలోంగ్ దూకుడు పెంచారు. నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండేందుకు ఇష్ట ప‌డ‌తారు. ప్ర‌కృతిని ఎక్కువ‌గా ఆరాధించే ఈ మంత్రి ఏది మాట్లాడినా లేక ఏ దాని గురించైనా ట్వీట్ చేసినా క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతుంది. ఆ త‌ర్వాత అది టాప్ లోకి , ట్రెండింగ్ లోకి దూసుకు వెళుతుంది. ఇంతలా మెస్మ‌రైజ్ చేస్తాడు టెమ్ జెన్ ఇమ్నా అలోంగ్. మొద‌ట టీచ‌ర్ గా చేశాడు. ఆ త‌ర్వాత బీజేపీలో చేరాడు.

ఆపై అంచెలంచెలుగా రాష్ట్ర చీఫ్ గా ఎన్నిక‌య్యాడు. పార్టీని ప‌వ‌ర్ లోకి తీసుకు వ‌చ్చేలా చేశాడు. మంత్రిగా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకునే ప‌నిలో ప‌డ్డాడు టెమ్ జెన్ ఇమ్నా అలోంగ్. తాజాగా ముద్దుగుమ్మ‌లు ఇమ్నాతో క‌లిసి ఫోటో తీసుకునేందుకు పోటీ ప‌డ్డారు. దీని గురించి అంద‌మైన క్యాప్ష‌న్ కూడా జ‌త చేశాడు ఇమ్నా. అంద‌రం ఉన్నా స్మార్ట్ టీవీ ఎందుక‌ని ప‌ని చేయ‌డం లేదంటూ ప్ర‌శ్నించాడు.

Leave A Reply

Your Email Id will not be published!