Justice MR Shah : జీనా య‌హా మ‌ర్నా య‌హా – జ‌స్టిస్ షా

కోర్టులో భావోద్వేగానికి లోనైన న్యాయ‌మూర్తి

నేను ఈ లోకంలో జీవించేందుకే వ‌చ్చాను. కానీ మ‌ర‌ణించేందుకు కాదు. కానీ ఉన్న కాలంలో మ‌నిషిగా బ‌త‌కాల‌ని కోరుకున్నా. కానీ కాలం నాకు ఎన్నో ఇచ్చింది. నేను ఉన్న‌త స్థాయి చేరుకునేందుకు దోహ‌ద ప‌డింది. ఈ స్థాయిలో ఉన్నానంటే కార‌ణం నా పేరెంట్స్, చ‌దువు నేర్పిన వాళ్లు కూడా. ప్ర‌తి ఒక్క‌రిని గుర్తు చేసుకోవాల్సిన స‌మ‌యం ఇది అని తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు జ‌స్టిస్ ఎంఆర్ షా.

సుప్రీంకోర్టులో సోమ‌వారం చివ‌రి రోజు కావ‌డంతో ఒకింత బాధ‌కు గుర‌య్యారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌ముఖ న‌టుడు, ద‌ర్శ‌కుడు రాజ్ క‌పూర్ సినిమాలోని పేరొందిన పాట జీనా య‌హా మ‌ర్నా య‌హా అంటూ ఉద‌హ‌రించారు. ఇది ఎల్ల‌వేళ‌లా ఐకానిక్ సాంగ్ గా నిలిచి పోయింది.

జ‌స్టిస్ ఎంఆర్ షా గ‌తంలో పాట్నా హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ప‌ని చేశారు. ఇక సుప్రీంకోర్టులో ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ఉన్నారు. కీల‌క‌మైన తీర్పులు వెలువ‌రించారు. తాను రిటైర్ అయ్యే వ్య‌క్తిని కాద‌ని, జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు జ‌స్టిస్ ఎంఆర్ షా. సీజేఐ ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్ అధ్య‌క్ష‌త‌న స‌మావేశం జ‌రిగింది.

ఈ సంద‌ర్బంగా క‌ల్ ఖేల్ మే హ‌మ్ హూ నా హో గార్దిష్ మే తారే ర‌హేంగే స‌దా అనే పాట‌ను గుర్తు చేసుకున్నారు . ఈ సంద‌ర్బంగా సీజేఐ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నేను భార‌త అడిష‌నల్ సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ గా ఉన్న‌ప్పుడు జ‌స్టిస్ షాతో ప్ర‌త్యేక అనుబంధం ఉంద‌న్నారు. ఆనాటి నుంచి నేటి దాకా మా ఇద్ద‌రి మ‌ధ్య బంధం అలాగే ఉంద‌న్నారు.

Leave A Reply

Your Email Id will not be published!