KTR US UK Tour : కేటీఆర్ యుఎస్, యుకె టూర్ స‌క్సెస్

కంపెనీలతో చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌దం

KTR US UK Tour : తెలంగాణ ఐటీ , ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ అమెరికా, యుకె ప‌ర్య‌ట‌న(KTR US UK Tour) ఫ‌ల‌ప్ర‌ద‌మైంది. చివ‌ర‌కు జ‌య‌ప్ర‌దంగా ముగిసింది. ఆయ‌న వెంట కీల‌క‌మైన టీం కూడా ఉంది. రెండు వారాల పాటు ప‌ర్య‌టించారు. 2 దేశాల‌ను చుట్టుముట్టారు. 80కి పైగా వివిధ రంగాల‌కు చెందిన వ్యాపార‌, వాణిజ్య కంపెనీల‌తో స‌మాలోచ‌న‌లు జ‌రిపారు. విస్తృతంగా తెలంగాణ సాధించిన అభివృద్ది , అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల గురించి మంత్రి కేటీఆర్ స్వ‌యంగా వివ‌రించారు.

దేశంలోనే తెలంగాణ పెట్టుబడులు పెట్టేందుకు స్వ‌ర్గ ధామంగా ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. న్యూయార్క్ లో కీల‌క స‌మావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌మ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత ఐటీ, ఫార్మా, లాజిస్టిక్ ప‌రంగా ఇండియాలోనే నెంబ‌ర్ వ‌న్ గా ఉంద‌న్నారు. గ‌తంలో ఐటీ అంటే బెంగ‌ళూరు పేరు చెప్పే వార‌ని, కానీ సీన్ మారిందన్నారు. తాము వ‌చ్చాక ఆ న‌గ‌రాన్ని వెన‌క్కి నెట్టి వేశామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇవాళ ఐటీ, ఫార్మా, లాజిస్టిక్, ఏరో స్పేస్, స్టార్ట‌ప్స్ ..ఇలా ప్ర‌తి దానిలో హైద‌రాబాద్ ముందంజ‌లో ఉంద‌న్నారు.

ఇందులో భాగంగా కేటీఆర్ చొర‌వ‌, కృషితో భారీ ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి ప్ర‌త్యేకించి హైద‌రాబాద్ కు మ‌హ‌ర్ద‌శ ప‌ట్ట‌నుంది. ప‌లు కంపెనీలు ఇక్క‌డ ఏర్పాటు చేసేందుకు మొగ్గు చూపాయి. ఈ మేర‌కు కేటీఆర్ కు హామీ ఇచ్చాయి. కొత్త‌గా వ‌చ్చే కంపెనీల ఏర్పాటు వ‌ల్ల దాదాపు 42,000 మందికి ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా జాబ్స్ రానున్నాయ‌ని మంత్రి కేటీఆర్ వెల్ల‌డించారు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకున్నారు. మంత్రి బృందం యుఎస్ తో పాటు యుకెలో ప‌ర్య‌టించింది.

Also Read : YS Jagan Delhi Tour

 

Leave A Reply

Your Email Id will not be published!