Rahul Gandhi Crazy : రాహుల్ క్రేజీ మామూలుగా లేదుగా
అమెరికా టూర్ లో సెల్ఫీ కోసం పోటీ
Rahul Gandhi Crazy : రాహుల్ గాంధీ మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా తనను తాను ప్రూవ్ చేసుకునే పనిలో పడ్డారు. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఆయనను పప్పు అంటూ ట్రోల్ చేసింది. కానీ తర్వాత తాను పప్పు కాదని పవర్ ఫుల్ బుల్లెట్ నంటూ చెప్పకనే చెప్పారు. రాహుల్ గాంధీని(Rahul Gandhi) తక్కువగా అంచనా వేసినందుకు లోలోపట మధన పడుతోంది కాషాయ వర్గాలు, శ్రేణులు.
ఎందుకంటే ఊహించని రీతిలో రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగింది. దానికి ప్రధాన కారణం ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర. కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా చేసిన యాత్ర పెను సంచలనం సృష్టించింది. దారి పొడవునా వేలాది మంది ఆయన వెంట నడిచారు. రాహుల్ గాంధీ మరింత పరిణతి చెందిన నాయకుడిగా రుజువు చేసుకున్నారు. ఢిల్లీ వేదికగా జరిగిన బహిరంగ సభలో ఏకంగా నటుడు కమల్ హాసన్ రాహుల్ ను ప్రశంసలతో ముంచెత్తారు.
ఇదిలా ఉండగా ఆరు రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలో బిజీ బిజీగా గడుపుతున్నారు రాహుల్ గాంధీ. మొన్న శాన్ ఫ్రాన్సిస్కోలో , నిన్న శాన్ పోర్ట్ యూనివర్శిటీలో కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్బంగా అక్కడి విద్యావేత్తలు, విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్బంగా రాహుల్ గాంధీతో సెల్ఫీ తీసుకునేందుకు పోటీ పడ్డారు పెద్ద ఎత్తున. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
Also Read : Rahul Gandhi
