YS Sharmila : దొరలదే రాజ్యం తెలంగాణ నాశనం
వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల
YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. బుధవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల పేరుతో ప్రజల డబ్బులను ఖర్చు చేస్తున్నారంటూ ఆరోపించారు. అసలు దొరలు ఎవరో దొంగలు ఎవరో జనానికి బాగా తెలుసన్నారు. ఎవరూ చెప్పాల్సిన పని లేదన్నారు. ప్రజలు ఇప్పటికే ఎవరికి ఓటు వేయాలో డిసైడ్ అయ్యారని జోష్యం చెప్పారు. ఇక ప్రతిపక్షాలపై సీఎం కేసీఆర్ అవాకులు చెవాకులు పేలడం విడ్డూరంగా ఉందన్నారు.
దళారీ దొంగలు, కొత్త వేషగాళ్లు, దోపిడీదారులంతా భారత రాష్ట్ర సమితి పార్టీలోనే ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు వైఎస్ షర్మిల(YS Sharmila). అంతా నమ్మి కేసీఆర్ చేతిలో పెడితే పూర్తిగా దొరల పాలన తీసుకు వచ్చారని మండిపడ్డారు . ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
నీళ్ల పేరుతో ఫామ్ హౌజ్ కు తరలించుకు పోయింది ఎవరో చెప్పాలన్నారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పిన మీరు కుటుంబానికే ప్రయారిటీ ఇచ్చారే తప్పా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని మండిపడ్డారు .
రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నా ఇప్పటి వరకు ఎందుకు ఫోకస్ పెట్టలేదో ప్రజలకు చెప్పాలన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చోటు చేసుకున్న స్కాంలో ఇంకా దోషులు ఎవరో తేల్చకుండానే ఎలా పరీక్షలు నిర్వహిస్తారంటూ నిప్పులు చెరిగారు వైఎస్ షర్మిల.
దళితులకు మూడు ఎకరాల హామీ ఏమైందని ప్రశ్నించారు సీఎం కేసీఆర్ ను. ప్రజలు బుద్ది చెప్పేందుకు రెడీగా ఉన్నారని పేర్కొన్నారు .
Also Read : DV Sadananda Gowda : బీఎల్ సంతోష్ పై సదానంద ఫైర్