AP CM YS Jagan : ముగిస‌న టూర్ ముంద‌స్తుపై ముచ్చ‌ట‌

ఏపీకి నిధులు ఇవ్వాల‌ని పీఎంకు సీఎం విన్న‌పం

AP CM YS Jagan : ఇరు తెలుగు రాష్ట్రాల‌లో రాజ‌కీయాలు రోజు రోజుకు మారుతున్నాయి. ముంద‌స్తు ఎన్నిక‌లు లేదంటూనే గ్రౌండ్ వ‌ర్క్ లో మునిగి పోయాయి అటు ఏపీలో వైసీపీ ఇటు తెలంగాణ‌లో బీఆర్ఎస్. ఎవ‌రి వ్యూహాలు వారివే. కానీ ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి(AP CM YS Jagan) రూట్ స‌ప‌రేట్. ఆయ‌న ఎక్కువ‌గా మాట్లాడేందుకు ఇష్ట‌ప‌డ‌డు. ఒక్క‌సారి క‌మిట్ అయ్యాడంటే ఇక ఎవ‌రు చెప్పినా విన‌డు. ఇది ఆయ‌న నైజం. ఇదిలా ఉండ‌గా ఏపీకి ప్ర‌త్యేక హోదా కావాల‌ని గ‌త కొంత కాలం నుంచీ కోరుతూ వ‌స్తున్నారు జ‌గ‌న్ రెడ్డి.

ఈ మేర‌కు ఆయ‌న ప‌లుమార్లు ఢిల్లీ బాట ప‌ట్టారు. తాజాగా హ‌స్తిన‌లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాను క‌లుసుకున్నారు. అక్క‌డి నుంచి నేరుగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు.

కాగా బుందేల్ ఖండ్ త‌ర‌హాలో ఏపీలోని కొన్ని జిల్లాల‌కు నిధులు ఇచ్చేందుకు కేంద్రం సుముఖ‌త వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. మ‌రో వైపు ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం నుంచి ఏపీ రాష్ట్రానికి రావాల్సిన నిధుల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కోరుతూ మ‌రోసారి విన‌తిప‌త్రాలు స‌మ‌ర్పించారు జ‌గ‌న్ రెడ్డి. ఈ మేర‌కు ప‌రిశీలించిన పీఎం సీఎంకు భ‌రోసా ఇచ్చారు. దీంతో త‌న ఢిల్లీ టూర్ ఫ‌ల‌ప్ర‌దంగా ముగియ‌డంతో ఆ వెంట‌నే ఏపీకి విచ్చేశారు జ‌గ‌న్ రెడ్డి. ఇదే స‌మ‌యంలో ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళితే ఎలా ఉంటుందోన‌ని ఆలోచ‌న కూడా చేస్తున్న‌ట్లు టాక్.

Also Read : Dattatreya Eatala : ఈటెల‌..జితేంద‌ర్ ను క‌లిపిన ద‌త్త‌న్న‌

Leave A Reply

Your Email Id will not be published!