PM Modi : టిబెటిన్ గురువు, ప్రముఖ ఆధ్యాత్మిక నాయకుడు దలై లామా పుట్టిన రోజు ఇవాళ. జూలై 6న, 1935లో పుట్టారు. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM MOdi) గురువారం ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో విలసిల్లుతూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రపంచంలో శాంతి నెలకొల్పేందుకు దలై లామా చేస్తున్న ప్రయత్నం గొప్పదని పేర్కొన్నారు.
దలై లామా ఈశాన్య టిబెట్ లోని అమ్డో లోని తక్సేర్ లో ఉన్న ఒక చిన్న పల్లెలో పుట్టాడు. తలిదండ్రులది వ్యవసాయ కుటుంబం. ఆయనకు లామో ధోండుప్ అని పేరు పెట్టారు. ఆరవ ఏట సన్యాస విద్యను అభ్యసించారు దలై లామా. తర్కం, లలిత కళలు, సంస్కృత వ్యాకరణం , వైద్యంలో శిక్షణ పొందారు. బౌద్ద తత్వ శాస్త్రంలో అత్యున్నత డాక్టరేట్ తో సమానమైన గెషే లరంపా డిగ్రీని పొందారు.
1950లో టిబెట్ పై చైనా దాడికి దిగింది. 1954లో మావో , డెంగ్ జియా వోపింగ్ , చౌ ఎన్ లైతో కలిశాడు. 1959లో క్రూరంగా అణిచి వేశారు. ఆనాటి నుండి దలైలామా ఉత్తర భారత దేశంలోని ధర్మ శాలలో నివసిస్తున్నారు. ఆనాటి నుంచి నేటి దాకా ప్రపంచ వ్యాప్తంగా శాంతి కోసం కృషి చేస్తున్నారు దలై లామా.
Also Read : Rahul Gandhi : రాహుల్ గాంధీ వైరల్
