బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు

ఉత్కంఠ రేపుతున్న తెలుగు రియాల్టీ షో

హైద‌రాబాద్ : బుల్లి తెర‌పై బిగ్ బాస్ -10 తెలుగు రియాల్టీ షో దుమ్ము రేపుతోంది. రోజు రోజుకు ట్విస్ట్ ల‌తో దూసుకు పోతోంది. ఉత్కంఠ‌ను క‌లిగిస్తోంది. తన ఐదవ వారాన్ని ఆసక్తికరమైన మలుపులు, కొత్త ఎంట్రీలు , ఊహించని డబుల్ ఎలిమినేషన్‌తో పూర్తి చేసుకుంది. తాజా వీకెండ్ ఎపిసోడ్‌లో ఐదుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను పరిచయం చేయడం ద్వారా ఈ రియాలిటీ షోలో కొత్త ఉత్సాహం నెలకొంది.బిగ్ బాస్ ఇంటిలోకి ప్రవేశించిన కొత్త కంటెస్టెంట్లు శివ కుమార్, నీతూ నటరాజ్, దక్ష గుత్తికొండ, శ్వేత నాయుడు , నవరసాల రామకృష్ణ. వీరి రాక ఆట గతిని మారుస్తుందని , ఇంటి సభ్యుల మధ్య కొత్త పోటీని సృష్టిస్తుందని భావిస్తున్నారు.

నటి ప్రియాంక జైన్ ప్రియుడిగా గుర్తింపు పొందిన శివ కుమార్ బైక్‌పై ఇంటిలోకి ప్రవేశించారు. నీతూ నటరాజ్, దక్ష గుత్తికొండ , శ్వేత నాయుడు కూడా షోలో చేరారు. చివరి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అయిన నవరసాలు రామకృష్ణ శ్రీకాకుళానికి చెందిన సామాన్యుడు.రామకృష్ణకు ఇంటి సభ్యుల నుంచి ఘన స్వాగతం లభించింది. హోస్ట్ నాగార్జున అందించిన బ్యాడ్జ్‌లను నరేష్ , రోహిత్‌లకు ఇవ్వడం ద్వారా వారికి మద్దతు తెలిపి, వారు ఎలిమినేషన్ నుండి తప్పించు కోవడంలో సహాయ పడ్డారు. వీకెండ్ ఎపిసోడ్‌లో డబుల్ ఎలిమినేషన్ కూడా జరిగింది. ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా మొదట అపూర్వ ఎలిమినేట్ అయ్యారు.

ఆ తర్వాత, ఎలిమినేషన్ ప్రక్రియలో శాలిని, చరణ్ మిగిలారు. ఇంటిలో కొనసాగాలని తాము కోరుకునే కంటెస్టెంట్‌కు ఓటు వేయాలని హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులను కోరారు. మొత్తం 11 ఓట్లలో, శాలిని 10 ఓట్లు పొందగా, చరణ్‌కు కేవలం ఒక ఓటు మాత్రమే వచ్చింది. దీంతో చరణ్ కూడా షో నుండి ఎలిమినేట్ అయ్యారు. ఇంటి సభ్యులకు వీడ్కోలు పలుకుతూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. తన ప్రయాణంలో ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించమని కోరారు. ఐదుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల రాక , ఇద్దరు కంటెస్టెంట్ల నిష్క్రమణతో, బిగ్ బాస్ తెలుగు 10 కొత్త దశ పోటీకి సిద్ధమైంది.

Leave A Reply

Your Email Id will not be published!