Pawan Kalyan Jagan : రూ. 1.18 ల‌క్ష‌ల కోట్లకు లెక్క చెప్పు

జ‌గ‌న్ కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌వాల్

Pawan Kalyan Jagan : జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. రూ. 1.18 ల‌క్ష‌ల కోట్లు అప్పులు ఎందు కోసం, ఎవ‌రి కోసం తీసుకు వ‌చ్చావో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు లెక్క‌లు చెప్పాల‌ని ప‌వ‌ర్ స్టార్ డిమాండ్ చేశారు. రెండో విడత వారాహి విజ‌య యాత్ర సంద‌ర్భంగా ఏలూరు లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan) ప్ర‌సంగించారు.

భారీ ఎత్తున తీసుకు వ‌చ్చిన అప్పుల‌కు సంబంధించి లెక్క‌లు స‌రిగా లేవంటూ కాగ్ నివేదిక‌లు స‌మ‌ర్పించింద‌ని ఆరోపించారు. ప్ర‌జ‌ల కోసం ప్ర‌శ్నిస్తున్న త‌న‌ను తిట్ట‌డ‌మే పనిగా పెట్టుకున్నారంటూ ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో ప్ర‌జ‌లు త‌గిన రీతిలో బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌న్నారు. సీఎం ప‌ద‌వికి జ‌గ‌న్ రెడ్డి అన‌ర్హుడ‌ని పేర్కొన్నారు. ప‌ర‌దాల మాటున బ‌య‌ట‌కు వ‌చ్చే మ‌హ‌రాణిలా జ‌గ‌న్ రెడ్డి మాట్లాడుతున్నాడంటూ మండిప‌డ్డారు జ‌న‌సేనాని.

ఆడ‌పిల్ల‌లు, ఒంట‌రి మ‌హిళ‌ల‌కు రాష్ట్రంలో ర‌క్ష‌ణ‌కు లేకుండా పోయింద‌న్నారు. కీల‌క స‌మాచారం బ‌య‌ట‌కు వెళ్ల‌డం వ‌ల్ల‌నే మ‌హిళ‌ల అక్ర‌మ ర‌వాణా జ‌రుగుతోంద‌న్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. జ‌గ‌న్ ఓ చెత్త , ప‌నికి మాలిన సీఎం అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. బుగ్గ‌లు నిమిరి, ముద్దులు పెట్టే వారిని న‌మ్మ వ‌ద్దంటూ సెటైర్ వేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

Also Read : USA Cricket Comment : క్రికెట్ పై క‌న్నేసిన ‘పెద్ద‌న్న‌’

 

Leave A Reply

Your Email Id will not be published!