US Drone Strike Kills : ఇస్లామిక్ లీడ‌ర్ ఉసామా ఖ‌తం

సిరియాలో డ్రోన్ల‌తో యుఎస్ దాడి

US Drone Strike Kills : వ‌ర‌ల్డ్ మోస్ట్ వాంటెడ్ ఉగ్ర‌వాదిగా పేరు పొందిన ఉసామా అల్ – ముహాజిర్ ను అమెరికా డ్రోన్ల‌తో(US Drones) చుట్టు ముట్టింది. సిరియాలో దాక్కున్న అత‌డిని వెంటాడి చంపేసింది. ర‌ష్యా సైన్యంతో ఉద్రిక్త‌త‌ల మ‌ధ్య ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ విష‌యాన్ని అమెరికా ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ కూడా ధ్రువీక‌రించింది. ఉసామా అల్ -ముహాజిర్ ను ఇప్ప‌టికే అత్యంత ప్రమాద‌క‌ర‌మైన ఉగ్ర‌వాదిగా ప్ర‌క‌టించింది. అత‌డి త‌ల‌కు వెల కూడా ఇప్ప‌టికే డిక్లేర్ చేయ‌డం విశేషం. డ్రోన్ల సాయంతో ఉసామాను ఖ‌తం చేసింది. కాగా ఈ మూకుమ్మ‌డి దాడుల్లో సామాన్య పౌరులు ఎవ‌రూ చ‌ని పోలేద‌ని అమెరికా తాజాగా వెల్ల‌డించింది.

కాగా ఉసామా అల్ – ముహాజిర్ సిరియా వేదిక‌గా చేసుకుని ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాలు గ‌త కొంత కాలం నుంచి నిర్వ‌హిస్తూ వ‌స్తున్నాడు. జూలై 9న యుఎస్ సెంట్ర‌ల్ క‌మాండ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌డం విశేషం. దాడికి కార‌ణ‌మైన ఎంక్యూ-9 రీప‌ర్ డ్రోన్ లు సిరియా లోని ప‌శ్చిమ భాగంలో ర‌ష్యా సైనిక జెట్ ల వేధింపుల‌ను ఎదుర్కొన్నాయి. సుమారు రెండు గంట‌ల పాటు ర‌ష్యా విమానాల నుండి వేధింపులు ఎదుర్కొన్న‌ప్పుడు మూడు రీప‌ర్ డ్రోన్ లు టెర్ర‌రిస్ట్ ఉసామా అల్ – ముహాజిర్ కోసం అన్వేష‌ణ జ‌రిపాయ‌ని తెలిపింది యుఎస్ ర‌క్ష‌ణ శాఖ‌.

సంఘ‌ట‌న జ‌రిగిన కొద్ది సేప‌టికే డ్రోన్ లు అలెప్పో ప్రాంతంలో మోటార్ సైకిల్ పై వెళుతున్న టెర్ర‌రిస్ట్ ను విజ‌య‌వ‌వంతంగా ల‌క్ష్యంగా చేసుకుని నిర్మూలించిన‌ట్లు యుఎస్ ప్ర‌క‌టించింది. వాయువ్య సిరియాలో త‌ల దాచుకున్నాడ‌ని పేర్కొంది.

Also Read : Chattisgarh Lok Poll Survey : ఛత్తీస్‌గఢ్ లో మ‌ళ్లీ హ‌స్తం హ‌వా

Leave A Reply

Your Email Id will not be published!