Kadiyam Srihari Rajaiah : కడియం భావోద్వేగం
రాజయ్య కామెంట్స్ పై ఫైర్
Kadiyam Srihari Rajaiah : మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కంట తడి పెట్టారు. తన తల్లిదండ్రులపై అవాకులు, చెవాకులు పేలిన స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని, ఇందులో తప్పేమీ లేదన్నారు. కానీ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే ఇంత నీచంగా మాట్లాడడం మంచి పద్దతి కాదన్నారు కడియం శ్రీహరి.
తన తల్లిని అవమానించడం తనను మరింత బాధకు గురి చేసిందన్నారు . రాజకీయల కోసం 93 ఏళ్ల తల్లిని ఎలా అనరాని మాటలు అంటారా అంటూ ప్రశ్నించారు కడియం శ్రీహరి(Kadiyam Srihari). తన తల్లి వెనుకబడిన కులానికి చెందిన వ్యక్తి అని, తండ్రి దళిత కులానికి చెందిన వ్యక్తి అని మరోసారి స్పష్టం చేశారు. పిల్లలకు తండ్రికి ఏ కులానికి చెందిన వాడైతే అదే వర్తిస్తుందని స్పష్టం చేశారు. తల్లి నిజం , తండ్రి ఊహ అనడం ఎంత వరకు సబబు అని నిలదీశారు.
తన వద్ద ఉన్న సమాచారం ప్రకారం నీ కుటుంబం గురించి మాట్లాడితే మొత్తం కుటుంబమే ఆత్మహత్యకు పాల్పడాల్సి వస్తుందని రాజయ్య గురించి సంచలన కామెంట్స్ చేశారు కడియం శ్రీహరి. ప్రజలకు సేవ చేయి. మంచి నాయకుడని అనిపించుకో. కేసీఆర్ వద్దకు వెళ్లు..టికెట్ తెచ్చుకో..దానికి నేను అభ్యంతరం పెట్టనని స్పష్టం చేశారు. రాజకీయాలు చేయి కానీ కుటుంబాలతో కాదంటూ సుతిమెత్తగా చురకలు అంటించారు శ్రీహరి.
Also Read : CM KCR : ఉమ్మడి పౌర స్మృతిని ఒప్పుకోం