Alla Ramakrishna Reddy : కాళ్లు కడిగిన ఎమ్మెల్యేకు హ్యాట్సాఫ్
వాలంటీర్ కు ఆళ్ల సన్మానం
Alla Ramakrishna Reddy : ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తున్న వాలంటీర్లపై నోరు పారేసుకున్న జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమైంది. రాష్ట్రమంతటా వాలంటీర్లు స్వచ్ఛంధంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మలను దగ్దం చేశారు. ఇదిలా ఉండగా ఎవరూ ఊహించని రీతిలో వాలంటీర్ కాళ్లు కడిగారు వైసీపీ పార్టీకి చెందిన మంగళగిరి శాసన సభ్యుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి. అనంతరం వాలంటర్లీందరికీ సన్మానం చేశారు. మీరు చేసిన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషించారంటూ ప్రశంసలు కురిపించారు. వారి కాళ్లు మొక్కినా , కడిగినా తప్పు లేదన్నారు. వాళ్ల సేవలకు తాను సలాం చేస్తున్నారనని అన్నారు ఆళ్ల రామకృష్ణా రెడ్డి(Alla Ramakrishna Reddy). ఎలాంటి ఆధారాలు లేకుండా సంచలనాల కోసం పవన్ కళ్యాణ్ దిగిజారి నోరు పారేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే.
రాబోయే రోజుల్లో ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమని జోష్యం చెప్పారు. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని లేక పోతే తనకు రాజకీయంగా వెనుకబాటు తప్పదన్నారు ఆళ్ల .
Also Read : Sourav Ganguly : ఆ ఇద్దరిని ఎందుకు తప్పించారు – గంగూలీ
