Nelson Mandela : నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే
ప్రతి ఏటా జూలై 18న దినోత్సవం
Nelson Mandela : నల్ల జాతి సూరీడు నెల్సన్ మండేలా గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి ఏటా జూలై 18న నెల్సన్ మండేలా చేసిన కృషికి గుర్తింపుగా అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ దినోత్సవాన్ని 2009వ సంవత్సరం నుంచి జరుపుతున్నారు.
Nelson Mandela’s birthday
వర్ణ వివక్షకు వ్యతిరేకంగా, ప్రపంచ శాంతి కోసం కృషిన వ్యక్తిగా గుర్తింపు పొందారు నెల్సన్ మండేలా(Nelson Mandela). ఆయన జయంతి సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరపడం విశేషం. మండేలా గౌరవార్థం ఆయన పుట్టిన రోజున వేడుకల్ని ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా చేపట్టాలని 10, నవంబర్ , 2009న ఐక్య రాజ్య సమితి తీర్మానం చేసింది. ఇందుకు సంబంధించిన చేసిన తీర్మానానికి ఏకంగా 192 దేశాల ప్రతినిధులు మూకుమ్మిడిగా మద్దతు తెలిపారు.
దీంతో ఆనాటి ఐక్య రాజ్య సమితి జనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ అలీ ట్రెకి తీర్మానం చేశారు. ఇదిలా ఉండగా ఏప్రిల్ 27న 2009లో నెల్సన్ మండేలా ఫౌండేషన్ మండేలా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం కోసం ప్రపంచ దేశాల మద్దతును ఆహ్వానించింది. ఇందులో భాగంగా ఆ ఏడాది జూలై 18న తొలిసారిగా అమెరికా లోని న్యూయార్క్ నగరంలో నల్ల సూరీడు దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఆయన చేసిన సమాజ సేవకు గుర్తుగా నివాళులు అర్పించారు.
Also Read : Magunta Raghava : మాగుంట రాఘవకు బెయిల్ మంజూరు
