Varudu Kalyani : సిసలైన సైకో చంద్రబాబు – కళ్యాణి
టీడీపీ ఆత్మ వంచన దీక్ష
Varudu Kalyani : వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు సిసలైన సైకో చంద్రబాబు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ నేతలు చేపట్టిన దీక్ష ఆత్మ వంచన దీక్షగా పేర్కొన్నారు. శనివారం వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు.
Varudu Kalyani MLC
టీడీపీ అంటే దుశ్శాసనులు, దృతరాష్ట్రులు అంటూ మండిపడ్డారు. ఒకప్పుడు టీచర్ గా పని చేసిన అనిత ఇలాగేనా మాట్లాడేది అంటూ ఫైర్ అయ్యారు వరుదు కళ్యాణి(Varadu Kalyani). ఆనాడు వనజాక్ష్తిపై దాడి చేసిన వ్యక్తిని , విజయవాడ కాల్ మనీ సెక్స్ రాకెట్ నిందితులను వెనకేసుకు వచ్చిన నీచుడు నారా చంద్రబాబు నాయుడు అంటూ ఫైర్ అయ్యారు.
చంద్రబాబు నాయుడు,నారాయణ, అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు బాలకృష్ణల ఇంటి ముందు దీక్షలు చేపట్టాలని సూచించారు వరుదు కళ్యాణి. మణిపూర్ ఘటన దారుణం , మహిళా లోకం ఖండిస్తోందన్నారు. ఇలాంటి ఘటనలు టీడీపీ హయాంలో చాలా సార్లు జరిగాయని ఆరోపించారు ఎమ్మెల్సీ. పెందుర్తి జెర్రి పోతుల పాలెంలో దళిత మహిళను మాజీ మంత్రి బండారు అనుచరులు వివస్త్రను చేసిన ఘటన మరిచి పోయారా చంద్రబాబు అంటూ నిప్పులు చెరిగారు. దిశ యాప్ తో ఏపీలో మహిళల భద్రతకు ఢోకా లేదన్నారు.
Also Read : Pawan Kalyan YS Jagan : ట్యాబ్ లు సరే మరుగుదొడ్ల మాటేంటి