Gudivada Amarnath : ప‌వ‌న్ జ‌ర నోరు జాగ్ర‌త్త – అమ‌ర్నాథ్

ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు

Gudivada Amarnath : జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు ఏపీ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్. వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను ప‌దే ప‌దే ప్ర‌శ్నిస్తూ వ‌స్తున్న ప‌వ‌ర్ స్టార్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎన్నిక‌ల ముందు రావ‌డం నిరాధార ఆరోప‌ణ‌లు చేయ‌డం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఒక అల‌వాటుగా మారింద‌ని ఫైర్ అయ్యారు మంత్రి. వాలంటీర్ల నియామ‌కానికి సంబంధించి ఏపీ ప్ర‌భుత్వం పూర్తి పార‌ద‌ర్శ‌క‌త‌తో వ్య‌వ‌హ‌రించింద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు స‌ర్కార్ 104 జీవోను జారీ చేసింద‌ని తెలిపారు. ఈ జీవో ప్ర‌కారం వాలంటీర్ల‌ను నియ‌మించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు గుడివాడ అమ‌ర్నాథ్.

Gudivada Amarnath Said

వాళ్ల బాస్ ఎవ‌రు అన్న‌ది పూర్తిగా తెలియాలంటే ఈ జీవో చ‌దివితే తెలుస్తుంద‌ని పేర్కొన్నారు . ముందు ఎవ‌రో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చ‌ద‌వ‌డం మానుకోమంటూ సూచించారు గుడివాడ అమ‌ర్నాథ్(Gudivada Amarnath). నీ ద‌త్త తండ్రి చంద్ర‌బాబు నాయుడు చెప్పుడు మాట‌లు విన‌డం బంద్ చేయాలంటూ పేర్కొన్నారు ఏపీ మంత్రి.

ఇంత కాలం సైలంట్ గా ఉన్న నువ్వు ఇప్ప‌టిక‌ప్పుడు కేవ‌లం వాలంటీర్ల‌ను టార్గెట్ చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు గుడివాడ అమ‌ర్నాథ్ . పనిగ‌ట్టుకుని వాలంటీర్ల‌ను తూల‌నాడ‌డం మానుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. ఇక నుంచైనా నోరు అదుపులో పెట్టుకోవాల‌ని లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.

Also Read : Byreddy Rajasekhar Reddy : తీగ‌ల వంతెన‌ను అడ్డుకుంటాం

 

Leave A Reply

Your Email Id will not be published!