Yogi Adityanath : భారతీయ జనతా పార్టీ లో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా గుర్తింపు పొందారు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath). సుదీర్గ చరిత్ర కలిగిన యూపీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్నారు. బీజేపీలో విస్మరించ లేని నాయకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకుని పాలనలో తనదైన ముద్ర కనబరుస్తున్నారు యోగి ఆదిత్యానాథ్.
Yogi Adityanath Recognized
బ్రహ్మచారిగా ఉన్న ఆయనకు పిల్లలన్నా, జంతువులన్నా, ప్రకృతి అన్నా, పుస్తకాలంటే చాలా ఇష్టం. ఏ మాత్రం సమయం ఉన్నా వెంటనే చదివేందుకు, కొత్త విషయం తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తుంటారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తాను కూడా మారేందుకు ప్రయత్నం చేశారు.
యూపీలో ప్రజా రంజక పాలన సాగిస్తున్నారు. ముఖ్యంగా నేరస్థుల గుండెల్లో నిద్ర పోతున్నారు. ఆయన పేరు చెబితే వణికి పోతున్నారు గ్యాంగ్ స్టర్లు. తాజాగా విమానంలో రెస్ట్ తీసుకోవాల్సిన సీఎం యోగి ఆదిత్యానాథ్ ట్యాబ్ ను చూడడం విస్తు పోయేలా చేసింది.
నేటి యువత ఆయనను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఎందుకంటే విలువైన కాలాన్ని వేస్ట్ చేస్తున్న వారంతా యోగి పని పట్ల శ్రద్ద, నిబద్దత, అంకిత భావం ఎంతో స్పూర్తిని కలిగిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఎంతైనా యోగినా మజాకా అని చెప్పక తప్పదు.
Also Read : Ram Gopal Varma : ఆర్జీవీ పోస్టర్ హల్ చల్
