Gaddar Singer : పోటెత్తిన పాట చైతన్యానికి ప్రతీక
దివికేగిన గద్దరన్నకు ఘన నివాళి
Gaddar Singer : ప్రజా యుద్ద నౌక గద్దరన్న పాట నిత్య చైతన్యానికి ప్రతీకగా నిలుస్తూ వచ్చింది. 74 ఏళ్ల వయసు వరకు పాటే ప్రాణంగా బతికాడు. పాటై ఉద్యమించాడు..ప్రవహించాడు. కోట్లాది మంది ప్రజలలో స్పూర్తిని రగిలించేందుకు ప్రయత్నించాడు. తూటాలు తనపై పేల్చినా తట్టుకుని నిలబడిన ఏకైక గాయకుడు గద్దర్. ఇవాళ నిస్తేజంగా నిద్రలోకి జారుకున్నాడు.
Gaddar Singer Emotional Journey
ప్రపంచ వ్యాప్తంగా విప్లవ, జానపద గాయకుడిగా పేరు పొందాడు గద్దర్(Gaddar). కవిగా, గాయకుడిగా, రచయితగా, వక్తగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు ఈ ప్రజా గాయకుడు. జన పదమై జాన పదమై పలవరించాడు. ప్రవహించేలా చేశాడు గద్దర్.
నక్సలైట్ , తెలంగాణ , ప్రజా పోరాటలకు ఊపిరి పోశాడు గద్దర్. అనేక సినిమాలకు పాటల రాశాడు. అవి కూడా హిట్ గా నిలిచాయి. తన గాన ప్రతిభతో ఆకట్టుకున్నాడు. ఉత్తర కోస్తా ఆంధ్రా లోని ఆదివాసీలు శ్రీకాకుళం సాయుధ పోరాటంలో స్పూర్తి పొందారు. 1969లో జానపద కళా రూపాలతో చైతన్యవంతం చేశాడు గద్దర్. 1971లో ఆపర రిక్షా తన తొలి పాట రాశారు. గద్దర్ గళం పేరుతో ఎన్నో పాటలు వచ్చాయి. గద్దర్ విప్లవ గీతాలకు పర్యాయ పదంగా మారారు. సామాజిక మార్పునకు శ్రీకారం చుట్టారు.
గద్దర్ పాటల ప్రభావంతో నక్సలైట్ ఉద్యమానికి ఆకర్షితులయ్యారు. 1997లో ఇంటి వద్ద ఉండగా కాల్పులకు గురయ్యాడు. 1980లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. బతికి బయట పడ్డాడు. తిరిగి తూటా లాగా ముందుకు వచ్చాడు. 2010 వరకు అలుపెరుగని పోరాటం చేశాడు. రెండో దశ తెలంగాణ ఉద్యమంలో మెరుపై మెరిశాడు. తన ఆట, పాటలతో దుమ్ము రేపాడు.
మహా కవి, విప్లవ వీరుడు, గద్దర్ గాత్రం తెలంగాణ ఆత్మను ప్రతిధ్వనించింది అని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమే అణగారిన వర్గాల కోసం అలుపెరుగని పోరాటం చేసేలా చేసిందన్నారు రాహుల్ గాంధీ.
Also Read : Gaddar Tribute : గద్దర్ కు ప్రముఖుల నివాళి