Gaddar Tribute : గ‌ద్ద‌ర్ కు ప్ర‌ముఖుల నివాళి

ప్ర‌జా యుద్ద‌నౌకకు సంతాపం

Gaddar Tribute : ప్ర‌జా యుద్ద నౌక గ‌ద్ద‌ర్(Gaddar) పార్థివ దేహానికి ప‌లువురు నివాళులు అర్పించారు. ప్ర‌జ‌ల సంద‌ర్శ‌నార్థం హైద‌రాబాద్ లోని లాల్ బ‌హ‌దూర్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున ప్ర‌జ‌లు, నాయ‌కులు తండోప తండాలుగా త‌ర‌లి వ‌స్తున్నారు. ఎస్డీఎఫ్ క‌న్వీన‌ర్ ఆకునూరి మురళి, ఆర్ఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ , బీఆర్ఎస్ నేత‌లు వినోద్ కుమార్ , ర‌స‌మ‌యి బాల కిష‌న్ , కేంద్ర మంత్రి , బీజేపీ స్టేట్ చీఫ్ కిష‌న్ రెడ్డి, సీనియ‌ర్ నేత రాంచంద్ర‌రావు, విర‌సం స‌భ్యుడు, ప్రొఫెస‌ర్ కాశీం, ప్రముఖ జ‌ర్న‌లిస్ట్ పాశం యాద‌గిరి , గాయ‌కురాలు విమ‌ల‌క్క‌, న‌ల్ల‌గొండ గ‌ద్ద‌ర్ , బీజేపీ సీనియ‌ర్ నేత వివేక్ వెంక‌టస్వామి, త‌దిత‌రులు నివాళులు అర్పించారు.

Gaddar Tribute Last Journey

తెలంగాణ‌లోని తూఫ్రాన్ లో 1949 లో పుట్టిన గ‌ద్ద‌ర్ వ‌య‌సు 74 ఏళ్లు. త‌న జీవిత కాల‌మంతా పాటై ప్ర‌వ‌హించాడు గ‌ద్ద‌ర్. ఆయ‌న అస‌లు పేరు గుమ్మ‌డి విఠ‌ల్ రావు. జీవిత‌మంతా క‌ష్టాలు ప‌డ్డాడు. కానీ తాను న‌మ్మిన సిద్దాంతం కోసం చివ‌రి దాకా పోరాడాడు.

పాట‌తోనే ప్ర‌వ‌హించాడు. ప్ర‌జ‌ల‌ను నిత్యం చైత‌న్య‌వంతం చేసేందుకు కృషి చేశాడు. ప్ర‌పంచంలో ఏ గాయ‌కుడు కూడా గ‌ద్ద‌ర్ లాగా తూటాలు శ‌రీరంలో పెట్టుకుని పాడ‌లేదు. ఒక్క గ‌ద్ద‌ర్ మాత్ర‌మే చివ‌రి క్ష‌ణం వ‌ర‌కు గోలీల‌ను తింటూ తూటాల‌ను త‌న‌లో పెట్టుకున్నాన‌ని అంటూ వ‌చ్చాడు .

Also Read : Priyanka Gandhi : గ‌ద్ద‌ర్ ను మ‌రిచి పోలేను – ప్రియాంక

Leave A Reply

Your Email Id will not be published!