Nara Lokesh : ప్రతి ఆడ బిడ్డకు రూ. 15 వేలు – లోకేష్
అధికారంలోకి వస్తే ఇస్తాం
Nara Lokesh : తెలుగుదేశం పార్టీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. యువ గళం పాదయాత్రలో భాగంగా మంగళవారం ఏపీలోని గురజాల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు పెద్ద పీట వేస్తామన్నారు.
Nara Lokesh Announced Manifesto
రాష్ట్ర వ్యాప్తంగా ఆయా కుటుంబాలలో ఎంత మంది ఆడ బిడ్డలు (మహిళలు, యువతులు, బాలికలు) ఉంటే వారికి ఒక్కొక్కరికీ సంవత్సరానికి 15 వేల రూపాయల చొప్పున ఇస్తామని ప్రకటించారు. అంతే కాదు ఒక బిడ్డ ఉంటే రూ. 15 వేలు, ఇద్దరు ఆడ బిడ్డలు ఉంటే రూ. 30,000 వేలు, ముగ్గురు ఉంటే రూ. 45,000 ఇస్తామని హామీ ఇచ్చారు. నేరుగా బిడ్డ తల్లి అకౌంట్ లో చదువు కునేందుకు వేస్తామని ప్రకటించారు నారా లోకేష్.
రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని, మహిళలకు, బాలికలకు, యువతులకు , చిన్నారులకు కూడా భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. షి టీమ్స్ ఉన్నా అవి పని చేయడం లేదంటూ ఆరోపించారు . భవిష్యత్తులో వచ్చేది తమ ప్రభుత్వమని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
Also Read : IT HUB Nizamabad : ఐటీ హబ్ నిజామాబాద్ రెడీ