KTR Bandi Sanjay : బండి భాషపై భ‌గ్గుమ‌న్న కేటీఆర్

రాహుల్ స‌రే బండి మాటేంటి

KTR Bandi Sanjay : ప్ర‌ధాని ఇంటి పేరును ప‌దే ప‌దే ప్ర‌స్తావించార‌ని, అవ‌మానించార‌ని పేర్కొంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అన‌ర్హ‌త వేటు వేశార‌ని మ‌రి ఇదే స‌మ‌యంలో త‌మ పార్టీకి చెందిన ఎంపీ బండి సంజ‌య్ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి అన‌రాని మాట‌లు అన్నార‌ని ఆరోపించారు మంత్రి కేటీఆర్.

KTR Bandi Sanjay Comments

ట్విట్ట‌ర్ వేదిక‌గా బండి ఘాటు వ్యాఖ్య‌ల‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఇది ఎంత మాత్రం మంచిది కాద‌న్నారు. ఒక‌రికి ఒక రూల్ మ‌రొక‌రికి మ‌రో రూల్ అనేది ఉంటుదా అని ప్ర‌శ్నించారు. ఇప్ప‌టికైనా స్పీక‌ర్ ఓం బిర్లా హుందాగా వ్య‌వ‌హ‌రించాల‌ని , వివ‌క్ష‌ను ప్ర‌ద‌ర్శించ‌డం మానుకోవాల‌ని సూచించారు కేటీఆర్(KTR).

లోక్ స‌భ‌లో తెలంగాణ రాష్ట్రానికి రెండు సార్లు సీఎంగా ఎన్నికైన కేసీఆర్ ను ఉద్దేశించి అత్యంత నీచ‌మైన భాష‌లో కించ ప‌రిచార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆయ‌న మాట్లాడుతుంటే మీరు ఎందుకు మౌనంగా ఉండాల్సి వ‌చ్చిందో చెప్పాల‌న్నారు కేటీఆర్.

రాహుల్ గాంధీని రెండేళ్ల పాటు స‌స్పెండ్ చేశారే మ‌రి బండి సంజ‌య్ ని ఎన్ని ఏళ్ల‌పాటు నిషేధం విధించాలో మీరే చెప్పాల‌ని స్ప‌ష్టం చేశారు. ఇలాంటి చ‌వ‌క‌బారు, నీచ‌మైన రాజ‌కీయాలు చేయ‌డం ఇక‌నైనా మానుకోవాల‌ని ఆయ‌న బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ కు హెచ్చ‌రించారు.

Also Read : Tirumala Rush : శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.90 కోట్లు

Leave A Reply

Your Email Id will not be published!