Minister KTR : బీజేపీ..కాంగ్రెస్ తోడు దొంగ‌లు – కేటీఆర్

నిప్పులు చెరిగిన ఐటీ శాఖ మంత్రి

Minister KTR : ఐటీ, పుర‌పాలిక శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. 75 ఏళ్ల స్వ‌తంత్ర భార‌త దేశ చ‌రిత్ర‌లో దేశాన్ని దోచుకున్న తోడు దొంగ‌లు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అని ధ్వ‌జ‌మెత్తారు. ఏఐసీసీ అంటేనే అఖిల భార‌త క‌ర‌ప్ష‌న్ క‌మిటీ అని , బీజేపీ అంటేనే భ్ర‌ష్టాచార్ జ‌న‌తా పార్టీ అని ఎద్దేవా చేశారు. మీ పార్టీలు అస‌మ‌ర్థ పాల‌న‌కు కేరాఫ్ అన్నారు. అవినీతి ప్ర‌భుత్వాల‌కు చిరునామా అంటూ మండిప‌డ్డారు కేటీఆర్.

Minister KTR Comments

మీ ఆధ్వ‌ర్యంలో కొలువు తీరిన ప్ర‌భుత్వాల పాప ఫ‌లిత‌మే ఇవాళ దేశానికి, రాష్ట్రానికి శాపంగా మారాయ‌ని ఆరోపించారు. నేరుగా భార‌త రాష్ట్ర స‌మితిని ఢీకొనే స‌త్తా లేక కాంగ్రెస్ , బీజేపీలు అడ్డ‌గోలుగా నోరు పారేసుకుంటున్నాయ‌ని మండిప‌డ్డారు కేటీఆర్(KTR).

ఎంఐఎం భుజంపై తుపాకీ ఎక్కు పెట్టి బీఆర్ఎస్ ను కాల్చేందుకు కుట్ర చేస్తోందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు . బీజేపీ భుజంపై గ‌న్ పెట్టి బీఆర్ఎస్ ను కాల్చే కుతంత్రం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్.

వెన్నుపోటు వార‌సుడిని న‌మ్ముకుని వెన్నుముక లేని పార్టీగా కాంగ్రెస్ మిగిలి పోయింద‌ని ఎద్దేవా చేశారు. త‌మ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రైతుల‌కు రిస్తే దార్ , ప్ర‌జ‌ల‌కు వ‌ఫాదార్ అని స్ప‌ష్టం చేశారు కేటీఆర్. మా సీఎం ఇమాన్ దార్ , స‌ర్కార్ జిమ్మే దార్ , పాల‌న జోర్ దార్ అని పేర్కొన్నారు.

Also Read : CM KCR Inaugurate : 25న ముహూర్తం సీఎం ప్రారంభం

Leave A Reply

Your Email Id will not be published!