Har Ghar Tiranga : అంత‌టా హ‌ర్ ఘ‌ర్ తిరంగా – మోదీ

ప్ర‌తి ఒక్క‌రూ డీపీ మార్చుకోండి

Har Ghar Tiranga : భార‌తీయ మువ్వొన్నెల ప‌తాకం ఎగ‌రేందుకు ఇంకా కొద్ది గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే మిగిలి ఉంది. దేశానికి స్వాతంత్రం వ‌చ్చి 76 ఏళ్ల‌వుతుంది. ఈ ఆగ‌స్టు 15తో 75 నుండి 76 ఏళ్లు ప‌డ‌తాయి. ఈ మ‌జిలీలో ఎన్నో మ‌లుపులు, మ‌జిలీలు, జ్ఞాప‌కాలు ఉన్నాయి. వేలాది మంది ఈ దేశం కోసం త‌మ ప్రాణాల‌ను తృణ పాయంగా త్యజించారు. ఆంగ్లేయుల దాష్టీకాల‌ను ఎదుర్కొని దేశానికి స్వేచ్ఛ ల‌భించిన రోజు ఇది. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ దేశ ప్ర‌జలంద‌రికీ పిలుపునిచ్చారు.

Har Ghar Tiranga Viral

ప్ర‌తి ఒక్కరూ భార‌తీయ ప‌తాకాన్ని ధ‌రించాల‌ని, సోష‌ల్ మీడియాలో మీమీ స్టేట‌స్ ల‌లో మార్పు చేసుకోవాల‌ని, త్రివ‌ర్ణ ప‌తాకాన్ని చేర్చాల‌ని, దానిని ప్ర‌మోట్ చేయాల‌ని కోరారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ(PM Modi) ఇచ్చిన పిలుపుతో వేలాది మంది త‌మ డీపీల‌ను మార్చుకుంటున్నారు.

అందులోకి క‌రీంన‌గ‌ర్ ఎంపీ, భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ కూడా మార్చారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ దేశానికి ఉన్న ఏకైక గుర్తు, బ‌లం, ఆత్మ గౌర‌వానికి ప్ర‌తీక ఈ జాతీయ జెండా అని పేర్కొన్నారు. హ‌ర్ ఘ‌ర్ తిరంగా ఉద్య‌మ స్పూర్తితో నా చిత్రాన్ని జాతీయ జెండాగా మార్చాన‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : Rahul Gandhi : ఆస్పత్రి అభివృద్దికి రాహుల్ ఆస‌రా

Leave A Reply

Your Email Id will not be published!