Nara Lokesh : మూడేళ్లలో అమరావతి పూర్తి చేస్తాం
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
Nara Lokesh : టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా సోమవారం ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానంగా అమరావతి విషయంపై ఫోకస్ పెట్టారు. చాలా సార్లు వైసీపీ నేతలు తమను టార్గెట్ చేశారని కానీ నిరూపించ లేక పోయారని మండిపడ్డారు. ఒక్క ఆధారం కూడా కోర్టులో సమర్పించ లేక పోయారని మండిపడ్డారు.
Nara Lokesh Promised for Amaravati
తాము రాబోయే ఎన్నికల్లో గెలుస్తామని, అధికారంలోకి వచ్చాక మూడు సంవత్సరాలలో అమరావతిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు తాను, తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.
ఆ తర్వాతనే తాము ఇల్లు కట్టుకుంటామని పేర్కొన్నారు నారా లోకేష్(Nara lokesh). రాష్ట్రాన్ని నమ్మి అప్పచెప్పితే పూర్తిగా అప్పుల కుప్పగా మార్చాడంటూ ఏపీ సీఎం జగన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. అక్రమాలకు, నేరాలకు , హింసకు కేరాఫ్ గా మార్చిన ఘనత సీఎంకే దక్కుతుందని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వం ఎన్నిరకాలుగా తన పాదయాత్రను అడ్డు కోవాలని చూసినా ప్రజలు తనను ఆదరిస్తూనే ఉన్నారని స్పష్టం చేశారు. అమరావతిపై అన్నీ అబద్దాలే చెబుతున్నారంటూ జగన్ పై మండిపడ్డారు.
Also Read : KTR Release : బీజేపీ 100 అబద్దాలు సీడీ రిలీజ్