Putin Congratulates : భార‌త్ కు పుతిన్ అభినంద‌న‌

చంద్ర‌యాన్ -3 స‌క్సెస్ గ్రేట్

Putin Wishes : భార‌త దేశం పేరు ప్ర‌పంచ వ్యాప్తంగా మారు మ్రోగుతోంది. ఇస్రో ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన చంద్ర‌యాన్ -3 ప్ర‌యోగం విజ‌య‌వంతం అయింది. ఈ సంద‌ర్బంగా ప‌లువురు దేశాధినేత‌లు, ప్ర‌ధానులు, ప్రెసిడెంట్లు ప్ర‌త్యేకంగా అభినంద‌న‌లు తెలియ చేస్తున్నారు.

తాజాగా భార‌త్ చిర‌కాల మిత్రుడిగా ప‌రిగ‌ణించే ర‌ష్యా చీఫ్ వ్లాదిబీర్ పుతిన్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. భార‌త దేశం సాధించిన ఈ స‌క్సెస్ త‌న‌ను ఎంత‌గానో ఆశ్చ‌ర్య పోయేలా చేసింద‌న్నారు. మీ అంద‌రు చేసిన కృషి ప్ర‌శంస‌నీయ‌మ‌ని కొనియాడారు.

Putin Wishes to India for Chandrayan-3

చంద్రుని వ‌ద్ద‌కు కేవ‌లం ఇప్ప‌టి వ‌ర‌కు మూడు దేశాలు మాత్ర‌మే వెళ్ల‌గ‌లిగాయి. చైనా, అమెరికా, ర‌ష్యా మాత్ర‌మేన‌ని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ఆయా అగ్ర దేశాల స‌ర‌స‌న భార‌త్ కూడా నిల‌వ‌డం బాగుందన్నారు పుతిన్.

భార‌త రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము, దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీకి అభినంద‌న సందేశాలు పంపించారు. ఈ స‌క్సెస్ అతి పెద్ద విజ‌యంగా పేర్కొన్నారు. భార‌త దేశం సాధించిన అతిపెద్ద అద్భుత‌మైన విజ‌యంగా పుతిన్(Putin) అభివ‌ర్ణించారు.

శాస్త్ర సాంకేతిక రంగంలో భార‌త్ త‌న‌దైన ముద్ర క‌న‌బ‌ర్చింద‌ని పేర్కొన్నారు. భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ నాయ‌క‌త్వం, సిబ్బందికి ర‌ష్యా ప్ర‌భుత్వం త‌ర‌పున అభినంద‌న‌లు తెలియ చేస్తున్న‌ట్లు పుతిన్ తెలిపారు.

Also Read : Ayutha Chandi Yagam : శ్రీ ల‌క్ష్మీ నృసింహ క‌ళ్యాణోత్స‌వం

Leave A Reply

Your Email Id will not be published!