A Chandrasekhar Joined : హస్తం గూటికి మాజీ మంత్రి
కండువా కప్పుకున్న చంద్రశేఖర్
A Chandrasekhar Joined : ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలిగింది. వికారాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన తన అనుచరులతో కలిసి గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth Reddy) , రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
A Chandrasekhar Joined in Congress
ఇదిలా ఉండగా ఎ. చంద్రశేఖర్ బలమైన గొంతుకగా ఉన్నారు. అపారమైన రాజకీయ అనుభవం ఉంది. తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించారు. సీఎం కేసీఆర్ టీంలో ఒకడిగా మెలిగారు. మంత్రిగా కూడా పని చేశారు. కానీ తర్వాత అభిప్రాయ భేదాలు రావడంతో గులాబీకి గుడ్ బై చెప్పారు.
అనంతరం భారతీయ జనతా పార్టీలో చేరారు. కానీ అక్కడ ఇముడ లేక పోయారు. ఆధిపత్య పోరు ఎక్కువగా ఉందని, ప్రత్యేకించి బహుజన వర్గాలకు ఆ పార్టీలో స్థానం లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు. పూర్తిగా రెడ్ల ఆధిపత్యం కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
చివరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తను దళితుడినైనందు వల్లనే పార్టీ జెండా కప్పలేదంటూ మండిపడ్డారు. ఈ దేశానికి స్వేచ్ఛ లభించినా తమ లాంటి వారికి ఫ్రీడం రాలేదన్నారు ఎ. చంద్రశేఖర్.
Also Read : Google CEO : అద్భుతం అపురూప సన్నివేశం