Renuka Chowdhury : ష‌ర్మిల ఏమైనా పాలేరులో పుట్టిందా

నిప్పులు చెరిగిన రేణుకా చౌద‌రి

Renuka Chowdhury : ఖ‌మ్మం – కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కురాలు రేణుకా చౌద‌రి(Renuka Chowdhury) నిప్పులు చెరిగారు. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ష‌ర్మిల తెలంగాణ‌కు చెందిన కోడ‌లు అయితే తాను ఖ‌మ్మం జిల్లా ఆడ బిడ్డ‌నంటూ ఫైర్ అయ్యారు.

Renuka Chowdhury Comments on YS Sharmila

రేణుకా చౌద‌రి మీడియాతో మాట్లాడారు. పాలేరు నుండి పోటీ చేసేందుకు ఇంకా ఎవ‌రైనా మిగిలి ఉన్నారా అంటూ ప్ర‌శ్నించారు. ష‌ర్మిల ఏమైనా పాలేరులో పుట్టిందా ఇక్కడి నుంచి పోటీ చేస్తా అని చెప్పేందుకు అంటూ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఇక్క‌డి నుండి బ‌రిలో ఉంటాన‌ని చెప్ప‌డానికి ఆమె ఎవ‌రు..ఇంత‌కూ ఆమెకు ఏం హ‌క్కు ఉందంటూ ధ్వ‌జ‌మెత్తారు రేణుకా చౌద‌రి.

దీనిపై ముందుగా హైక‌మాండ్ స్ప‌ష్టం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. తెలంగాణ కోడ‌లు అని ఇన్నాళ్ల‌కు ష‌ర్మిల‌కు గుర్తు వ‌చ్చిందా అని నిల‌దీశారు. అస‌లు ఏపీ నాయ‌కుల‌కు తెలంగాణ‌లో ఏం ప‌ని అని నిప్పులు చెరిగారు. తెలంగాణ‌లో ష‌ర్మిల ఎంత‌నో ఏపీలో కూడా నేను కూడా అంతేన‌ని పేర్కొన్నారు. నేను కూడా వెళ్లి ఆంధ్రాలో పోటీకి దిగుతానంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు రేణుకా చౌద‌రి.

ఇదిలా ఉండ‌గా ఆమె చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఇప్ప‌టికే త‌న పార్టీని విలీనం చేసేందుకు వైఎస్ ష‌ర్మిల ప‌లుమార్లు ఢిల్లీకి వెళ్లింది. రాహుల్, సోనియా గాంధీతో భేటీ అయ్యారు.

Also Read : Bhatti Vikramarka Mallu : తుమ్మ‌ల కాంగ్రెస్ లోకి రావాలి – భ‌ట్టి

Leave A Reply

Your Email Id will not be published!