IND vs AUS 2nd ODI : భార‌త్ దెబ్బ‌కు ఆసిస్ విల‌విల‌

వ‌న్డే సీరీస్ కైవ‌సం చేసుకున్న టీమిండియా

IND vs AUS 2nd ODI  : కేఎల్ రాహుల్ నాయ‌క‌త్వంలోని భార‌త జ‌ట్టు అద్బుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఇండోర్ వేదిక‌గా జ‌రిగిన రెండో వ‌న్డే మ్యాచ్ లో భారీ తేడాతో గ్రాండ్ విక్ట‌రీ సాధించింది. 99 ప‌రుగుల తేడాతో ఆసిస్ ఓట‌మి పాలైంది.

మూడు మ్యాచ్ ల సీరీస్ లో భాగంగా రెండు మ్యాచ్ ల‌లో గెలుపొంది సీరీస్ కైవ‌సం చేసుకుంది. ప్ర‌స్తుతం భార‌త్ వ‌రుస‌గా ఒక‌టి, రెండో మ్యాచ్ ల‌లో విజ‌యం సాధించి 2-0 తో ఆధిక్యంలో కొన‌సాగుతోంది.

IND vs AUS 2nd ODI Viral

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ న‌మోదు చేసింది. భార‌త్ కు చెందిన ఇద్ద‌రు ఆట‌గాళ్లు సెంచ‌రీల మోత మోగించారు. ఎప్ప‌టి లాగే కేఎల్ రాహుల్(KL Rahul) , సూర్య కుమార్ మ‌రోసారి హాఫ్ సెంచ‌రీల‌తో మెరిశారు. నిర్ణీత ఓవ‌ర్ల‌లో ఇండియా బిగ్ స్కోర్ న‌మోదు చేసింది.

శుభ్ మ‌న్ గిల్ సూప‌ర్ ప‌ర్ ఫార్మెన్స్ తో రెచ్చి పోయాడు. శ్రేయ‌స్ అయ్య‌ర్ సైతం త‌న‌కు ఎదురే లేదంటూ సెంచ‌రీల మోత మోగించారు. ఆస్ట్రేలియా ఏ కోశాన ప్ర‌భావితం చూప‌లేక పోయింది. ఆసిస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుని త‌ప్పు చేసింది. 50 ఓవ‌ర్ల‌లో భార‌త్ 5 వికెట్లు కోల్పోయి 399 ర‌న్స్ చేసింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన ఆసిస్ 28.2 ఓవ‌ర్ల‌లో 217 ర‌న్స్ కే ప‌రిమిత‌మై చాప చుట్టేసింది.

Also Read : Mynampally Hanumantha Rao : మ‌ల్లారెడ్డి దోచుకున్న‌డు

Leave A Reply

Your Email Id will not be published!