న్యూఢిల్లీ : భారత దేశంలో పరీక్షల లీకులపై విచారణ చేపట్టాలని కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీ వేదికగా నిర్వహించిన నిరసనలకు బేషరతుగా మద్దతు ఇచ్చినందుకు ఎంపీ రాహుల్ గాంధీకి రుణపడి ఉంటామన్నారు AISA అధ్యక్షురాలు నేహా బోరా . రాహుల్ గాంధీతో ఈ రోజు జరిగిన చర్చ చాలా ఫలప్రదంగా ఉందని నేను భావిస్తున్నాను. దేశ విద్యా విధానంపై ఇలాంటి చర్చలు చాలా అరుదుగా జరుగుతుంటాయని పేర్కొన్నారు. విద్యపై అర్థవంతమైన చర్చ జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యువతలోని ఉజ్వలమైన మేధస్సు, వారి అభ్యాసం, జిజ్ఞాసను దెబ్బతీసేలా మొత్తం విద్యా వ్యవస్థను ఎలా గుప్పిట్లోకి తీసుకున్నారనే దానిపై ఎలాంటి చర్చా జరగక పోవడం దారుణమన్నారు నేహా బోరా. ఈ అంశంపై మేము అద్భుతమైన చర్చ జరిపామన్నారు. తాము ఆయనతో పంచుకున్న మరో ఆందోళన ఏమిటంటే, ఈ రోజు ‘బీహార్ బంద్’కు పిలుపునిచ్చారు.
అయితే బంద్‌కు ముందే, నిన్ననే, పెద్ద సంఖ్యలో విద్యార్థి కార్యకర్తలను బీహార్ పోలీసులు అరెస్టు చేశారు… ఆయన ఇక్కడ లేవనెత్తిన మూడు డిమాండ్లు నిజంగానే ఈ దేశ యువత , విద్యార్థుల డిమాండ్లకు ప్రతిరూపంగా ఉన్నాయని చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. శాఖ మార్పు (మంత్రిత్వ శాఖ మార్పు) ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా తెచ్చే ఏ బిల్లు కూడా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌ను సంతృప్తి పరచలేదు. 20వ తేదీన జరిగిన హింసాత్మక ఘటనలకు బాధ్యత వహించాల్సిందే. పోలీస్ కమిషనర్, హోం మంత్రి కూడా బాధ్యత వహించాలి. ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదా సర్దుబాటు ఉండదన్నారు నేహా బోరా.
