H-1B వీసాపై 1,00,000 డాలర్ల ఫీజు పున‌రుద్ద‌ర‌ణ చెల్ల‌దు

అమెరికా దేశ అధ్య‌క్షుడు ట్రంప్ స‌ర్కార్ కు కోర్టు బిగ్ షాక్

అమెరికా : అమెరికా కోర్టు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఏక‌ప‌క్ష నిర్ణ‌యాన్ని తోసిపుచ్చింది. ఆయ‌న‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. H-1B వీసాపై 1,00,000 డాలర్ల రుసుమును పునరుద్ధరించే ట్రంప్ ప్రయత్నాన్ని ఎట్టి ప‌రిస్తితుల్లో ఒప్పుకునేది లేదంటూ అమెరికా కోర్టు తిరస్కరించింది. అమెరికా ఏటా 65,000 H-1B వీసాలను, అలాగే ఉన్నత విద్యా అర్హతలు కలిగిన విదేశీ కార్మికుల కోసం అదనంగా 20,000 వీసాలను జారీ చేస్తుంది. అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికుల H-1B వీసాలపై 1,00,000 డాలర్ల రుసుము విధించాలన్న ట్రంప్ పరిపాలన నిర్ణయాన్ని రద్దు చేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించడానికి అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు నిరాకరించింది. బోస్టన్ కేంద్రంగా పనిచేసే ‘ఫస్ట్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్’లోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం, ఈ రుసుమును చట్ట విరుద్ధమైన పన్నుగా (కాంగ్రెస్ ఆమోదం లేనిదిగా) పేర్కొంటూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టారు అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి లియో టి. సోరోకిన్ జూన్ 8న ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలన్న ఫెడరల్ ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించింది.

ఈ కోర్టులో అప్పీల్ పెండింగ్‌లో ఉన్న సమయంలో, డిస్ట్రిక్ట్ కోర్టు జూన్ 8 నాటి మెమోరాండం, ఉత్తర్వు , తీర్పులపై స్టే విధించాలన్న ప్రతివాదుల అభ్యర్థనను తాము తిరస్కరిస్తున్నామ‌ని ధర్మాసనం సంచ‌ల‌న తీర్పునిచ్చింది. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, కాంగ్రెస్ సంబంధిత అధికారాన్ని బదిలీ చేయవచ్చా లేదా అనేది కాదు; అసలు కాంగ్రెస్ అలా చేసిందా లేదా అన్నదే ముఖ్యం అని వాదించిన పిటిషనర్లతో (డెమోక్రాట్ పాలనలోని 20 రాష్ట్రాలు) న్యాయమూర్తులు ఏకీభవించారు. కొత్త H-1B వీసాల జారీకి 1,00,000 డాలర్ల రుసుము విధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది సెప్టెంబరులో ఒక ప్రకటన జారీ చేశారు. H-1B వీసా అనేది ఒక ‘నాన్-ఇమ్మిగ్రెంట్’ (శాశ్వత నివాస హోదా లేని) వీస. ఇది సిద్ధాంత పరమైన లేదా సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే ప్రత్యేక వృత్తులలో విదేశీ కార్మికులను నియమించు కోవడానికి అమెరికా కంపెనీలకు అనుమతినిస్తుంది.

భారత్, చైనా వంటి దేశాల నుండి ఏటా వేలాది మంది ఉద్యోగులను నియమించు కోవడానికి అమెరికా సాంకేతిక సంస్థలు దీనిపై ఆధార పడతాయి. 1989 నాటి అమెరికా సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ, ఆర్థిక భారాన్ని మోపేలా విచక్షణాధికారాన్ని కల్పించేటప్పుడు అవి ‘ఫీజులు’ అయినా లేదా ‘పన్నులు’ అయినా సరే కాంగ్రెస్ “స్పష్టంగా” వ్యవహరించిందని కార్యనిర్వాహక శాఖ నిరూపించాలని అప్పీల్స్ కోర్టు పేర్కొంది. అయితే, ఈ విషయంలో ఆ స్పష్టమైన ప్రమాణం ఎందుకు అవసరం లేదో ట్రంప్ యంత్రాంగం వివరించలేదు అని ఆ ఉత్తర్వులో ఉంది. నిలిపివేత ఉత్తర్వు మంజూరు చేయకపోతే పిటిషనర్ రాష్ట్రాలకు గణనీయమైన నష్టం ఎందుకు వాటిల్లదో నిరూపించడంలో కూడా యంత్రాంగం విఫలమైందని కోర్టు తెలిపింది.

Leave A Reply

Your Email Id will not be published!