Dial Your 112 : కేంద్రం సంచలన నిర్ణయం
ఏ సేవ కైనా 112కు డయల్ చేస్తే చాలు
Dial Your 112 : న్యూఢిల్లీ – కేంద్రంలో కొలువు తీరిన మోదీ(PM Modi) , బీజేపీ సంకీర్ణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఏ సమస్యకైనా చెప్పుకునేందుకు ఎమర్జెన్సీ (అత్యవసర )కి సంబంధించి డయల్ నంబర్ ను ఏర్పాటు చేశారు. తాజాగా దీనిని మారుస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
Dial Your 112 Service Started Central
ఇదిలా ఉండగా ఇప్పటి దాకా ఒక్కో సమస్యకు ఒక్కో నెంబర్ కు డయల్ చేయాల్సి వచ్చేది. దీనిని గమనించిన సర్కార్ అన్ని సేవలను ఒకే డయల్ నెంబర్ కిందకు వచ్చేలా చేసింది. ఇందుకు సంబంధించి మంగళవారం వెల్లడించింది నిర్ణయాన్ని.
దేశంలో నివసిస్తున్న వారు ఎవరైనా సరే తమకు ఏదైనా సమస్య ఉన్నా లేదా ఆపదలో ఉన్నా, సాయం కావాలన్నా, ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నా వెంటనే 112 నంబర్ కు కాల్ చేయాలని స్పష్టం చేసింది ప్రభుత్వం.
ఇక నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంటనే డయల్ యువర్ 112కి చేస్తే ఆ వెంటనే సమస్యకు సంబంధించి ఇతర డయల్ నెంబర్లకు చేర వేస్తారు. దీని వల్ల ఎలాంటి ఆలస్యం అన్నది ఉండదని తెలిపింది కేంద్రం. దీని వల్ల ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని పేర్కొంది.
Also Read : Varudu Kalyani : బాబూ ఆ 20 వేల కోట్లు ఎక్కడివి..?