Double Bed Room : డ‌బుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పంపిణీ

ల‌బ్దిదారుల‌కు మంత్రుల అంద‌జేత‌

Double Bed Room : హైద‌రాబాద్ – తెలంగాణ‌లో ఎన్నిక‌ల నగారా మోగ‌నుండ‌డంతో తెలంగాణ‌లో కొలువు తీరిన బీఆర్ఎస్ ప్ర‌భుత్వం త్వ‌రిత‌గ‌తిన సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్దిదారుల‌కు మేలు చేకూర్చేలా పంపిణీకి శ్రీ‌కారం చుట్టింది. ఇప్ప‌టికే డ‌బుల్ బెడ్ రూమ్ ల‌ను ల‌బ్దిదారుల‌కు కేటాయించింది.

Double Bed Room Houses Distribution

హైద‌రాబాద్ లో గురువారం నాలుగో విడ‌త డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్య‌క్ర‌మం జ‌రిగింది. దుండిగ‌ల్ లో ప్ర‌భుత్వం నిర్మించిన 2,550 ఇళ్ల‌ను పంపిణీ చేశారు రాష్ట్ర హోం శాఖ మంత్రి మ‌హ‌మూద్ అలీ(Mohammed Ali). మ‌ర‌హ‌రిప‌ళ్లిలో 2,376 ఇళ్ల‌ను పంపిణీ చేశారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామ‌కూర మ‌ల్లారెడ్డి.

ఇక న‌గ‌రంలోని రాంప‌ల్లిలో 2,845 ఇళ్ల‌ను పంపిణీ చేశారు రాష్ట్ర ఉప స‌భాప‌తి ప‌ద్మా రావు గౌడ్ . ఇక ఉప్ప‌ల్ లోని చైత‌న్య‌న‌గ‌ర్ లో నిర్మించిన 396 డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల‌ను పంపిణీ చేశారు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి. కొర్రెముల‌లో 720 ఇళ్ల‌ను పంపిణీ చేశారు రాష్ట్ర మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్. తూముకుంట‌లో 1548 ఇళ్ల‌ను పంపిణీ చేశారు డిప్యూటీ మేయ‌ర్ శ్రీ‌ల‌త శోభ‌న్ రెడ్డి.

మొత్తంగా దీన్నిబ‌ట్టి చూస్తుంటే త్వ‌ర‌లోనే రాష్ట్రంలో ఎన్నిక‌ల న‌గారా మోగ‌నుంద‌ని అర్థం అవుతోంది.

Also Read : Asian Games 2023 : ఆసియా క్రీడ‌ల్లో భార‌త్ హవా

Leave A Reply

Your Email Id will not be published!