Muttireddy Yadagiri Reddy : ఆర్టీసీ చైర్మన్ గా ముత్తిరెడ్డి
బంపర్ ఆఫర్ ఇచ్చిన కేసీఆర్
Muttireddy Yadagiri Reddy : తెలంగాణ – భారత రాష్ట్ర సమితి పార్టీ బాస్ , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న తరుణంలో పదవుల పందేరానికి శ్రీకారం చుట్టారు. పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి వలసలు వెళ్లకుండా నివారించే ప్రక్రియలో భాగంగా పలువురికి చైర్మన్ పోస్టులను కట్టబెట్టారు.
Muttireddy Yadagiri Reddy As a TSRTC Chairman
తాజాగా ముగ్గురికి చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్ గా నియమించారు సీఎం కేసీఆర్. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర రైతు బంధు సంస్థ చైర్మన్ గా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను నియమించారు.
ఇక తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ గా ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డికి(Muttireddy Yadagiri Reddy) ఛాన్స్ ఇచ్చారు. ఇదిలా ఉండగా రాజయ్యపై లైంగిక ఆరోపణలు ఉన్నాయి. ఇక ముత్తిరెడ్డిపై భూ కబ్జాలకు పాల్పడినట్లు స్వంత కూతురే బహిరంగంగా ఆరోపణలు చేసింది. అయినా ఈ ఇద్దరికీ చైర్మన్లు గా ఛాన్స్ ఇవ్వడం పట్ల ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి.
Also Read : Thatikonda Rajaiah : రైతు బంధు చైర్మన్ గా రాజయ్య