Cheekoti Praveen : బీజేపీ గూటికి చీకోటి

డీకే అరుణ స‌మ‌క్షంలో చేరిక

Cheekoti Praveen : హైద‌రాబాద్ – క్యాసినో వ్య‌వ‌హారంలో తెలుగు రాష్ట్రాల‌లో సంచ‌ల‌నం రేపిన చీకోటి ప్ర‌వీణ్ శ‌నివారం అధికారికంగా భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరారు. ఆయ‌న‌కు కాషాయ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆ పార్టీ జాతీయ ఉపాధ్య‌క్షురాలు డీకే అరుణ భ‌ర‌త సింహా రెడ్డి.

Cheekoti Praveen Joined in BJP

త‌న‌పై ప‌లు కేసులు ఉన్నాయి. అంత‌కు మించిన ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇటీవ‌లే మాజీ బీజేపీ చీఫ్‌, క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ కుమార్ తో ఢిల్లీలో భేటీ అయ్యారు. తాను మొద‌టి నుంచి ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ , హిందూ సంస్థ‌ల‌లో ఉన్నాన‌ని త‌న‌పై వ‌చ్చిన‌వ‌న్నీ ఆరోప‌ణ‌లు త‌ప్ప వాస్త‌వం కాద‌ని స్ప‌ష్టం చేశారు చీకోటి ప్ర‌వీణ్.

కావాల‌ని త‌న‌ను బ‌ద్నాం చేశారంటూ వాపోయారు. ఇదే స‌మ‌యంలో బండి లైన్ క్లియ‌ర్ చేశారంటూ ఆ మ‌ధ్య‌న ప్ర‌చారం జ‌రిగింది. తీరా బీజేపీలో చేరేందుకు ముహూర్తం రెడీ చేసుకున్నారు చీకోటి ప్ర‌వీణ్‌(Cheekoti Praveen). తన భారీ అనుచ‌ర గ‌ణంతో పార్టీ ఆఫీసుకు వ‌చ్చారు.

తీరా చేర్చుకుంటామ‌ని చెప్పి బీజేపీ చీఫ్ కిష‌న్ రెడ్డి గాయ‌బ్ అయ్యారు. దీంతో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు చీకోటి ప్ర‌వీణ్ . త‌న‌ను ఎవ‌రు అడ్డుకోలేరంటూ పేర్కొన్నారు. కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా ఆదేశించ‌డంతో గ‌త్యంత‌రం లేక డీకే అరుణ స‌మ‌క్షంలో పార్టీలో చేర్చుకున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి కిష‌న్ రెడ్డి డుమ్మా కొట్టారు.

Also Read : Mynampally Hanumantha Rao : మైనంప‌ల్లి షాకింగ్ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!